తమ మిత్రపక్షంగా ఉన్న బిజెపిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చిక్కుల్లో పడేశారు.
బిజెపి , జనసేన ఏపీలో అధికారికంగా పొత్తు పెట్టుకున్నాయి.
వచ్చే ఎన్నికల్లోను కలిసి పోటీ చేయాలని నిర్ణయంతో ఉన్నాయి.టిడిపిని కలుపుకుని వెళ్లేందుకు పవన్ చాలా కాలంగా బిజెపి నాయకులపై ఒత్తిడి చేస్తూనే ఉన్నా, ఈ విషయంలో ఆ పార్టీ నాయకులు ఏ క్లారిటీ ఇవ్వడం లేదు.
అయితే ఎన్నికల సమయం నాటికి ఏదో రకంగా బిజెపిని ఒప్పించి మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లి వైసీపీని ఓడించాలనే పట్టుదలతో పవన్ ఉంటూ వచ్చారు.అయితే ఆకస్మాత్తుగా టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )అవినీతి ఆరోపణలతో జైలు పాలుకావడంతో ఆయనను పరామర్శించేందుకు వెళ్లిన పవన్ బయటకు వచ్చిన తర్వాత పొత్తుల అంశంపై కీలక ప్రకటన చేశారు.
వచ్చే ఎన్నికల్లో టిడిపి , జనసేన పార్టీలు ( TDP JanaSena )కలిసి పోటీ చేయబోతున్నాయని, బిజెపి( BJP ) కూడా తమతో కలిసి వస్తే బాగుంటుందని పవన్ వ్యాఖ్యానించారు.పవన్ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం పై బిజెపి నేతలు ఏ విధంగా స్పందించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.ఇప్పటికే చంద్రబాబు అరెస్టుపై ఏపీ బీజేపీ నేతలు స్పందించారు.
చంద్రబాబు అరెస్టు అక్రమం అని, ఆయనను అరెస్టు చేసిన విధానం సరికాదంటూ మొదటి రోజు మాట్లాడిన బిజెపి నేతలు ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇప్పటికీ చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో స్పందిస్తూ, వైసిపి ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు.
ఈ వ్యవహారం ఇలా ఉంటే తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన టిడిపి తో పొత్తు పెట్టుకోబోతుందనే విషయాన్ని తమకు మాట మాత్రం అయినా చెప్పకుండా అకస్మాత్తుగా ఈ ప్రకటన చేయడం తో తాము ఏ ప్రకటన చేయాలో అర్థం కాని పరిస్థితి బీజేపీలో నెలకొంది.బిజెపి అగ్ర నేతలు మాత్రం టిడిపితో జనసేన పొత్తు( TDP JanaSena ) పెట్టుకోవడాన్ని సీరియస్ గానే తీసుకుంటున్నారు .
ఆ పార్టీతో కలిసి వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.అయితే ఏపీ బీజేపీ నేతలు కొంతమంది మాత్రం జనసేన టిడిపి తో కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటన చేస్తున్నారు. దీంతో అధికారికంగా ఈ పొత్తుల అంశంపై స్పందించాల్సిన పరిస్థితి బీజేపీపై పడింది.
టిడిపి తో కలిసి వెళ్లేందుకు ఇష్టపడకపోతే జనసేనని కూడా వదులుకోవాల్సి ఉంటుంది.అలా అని ఏపీలో ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా లేకపోవడంతో, ఈ విషయంలో ఏం చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్లాలి ఏ నిర్ణయాన్ని ప్రకటించాలి అనే విషయంలో తర్జభర్జనలు పడుతోంది.
మొత్తంగా పవన్ టిడిపి తో పొత్తు అంశాన్ని ప్రస్తావించి తమ మిత్రపక్షంగా ఉన్న బిజెపిని ఇరకాటంలో పెట్టారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy