వామ్మో.. మహేష్ బాబుపై ఇంత పగా.. సర్కారు వారి పాటపై ఎన్ని కుట్రలు జరిగాయంటే?

బాలనటుడిగా పదుల సంఖ్యలో సినిమాలలో నటించిన మహేష్ బాబు ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలతో విజయాలను అందుకున్నారు.

రాజకుమారుడు సినిమాతో హీరోగా ప్రయాణం మొదలుపెట్టిన మహేష్ బాబు సినీ కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి.

మహేష్ బాబు భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సైతం స్టార్ డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి దర్శకులుగా పని చేయనున్నారు.ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉన్న మహేష్ బాబు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

అయితే మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట విషయంలో జరిగిన కుట్రలు చూసి మహేష్ బాబు అభిమానులు సైతం అవాక్కవుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సర్కారు వారి పాట బెనిఫిట్ షోలు ప్రదర్శితం కాగా ఆ షోలు పూర్తికాకముందే సినిమాకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది.

డిజాస్టర్ ఎస్వీపీ అనే హ్యాష్ ట్యాగ్ ను కొంతమంది కావాలని ట్రెండ్ చేశారు.

Some Media Channels Negative Campaign On Sarkaru Vaari Paata Details, Mahesh Bab
Advertisement
Some Media Channels Negative Campaign On Sarkaru Vaari Paata Details, Mahesh Bab

మహేష్ బాబుపై పగతోనే ఈ విధంగా చేశారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.మీమ్స్ ద్వారా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు పెడుతుండగా ఆ పోస్టులు సైతం న్యూట్రల్ ఆడియన్స్ లో నెగిటివ్ ఒపీనియన్ ను కలగజేస్తుండటం గమనార్హం.కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు సైతం ఈ సినిమాకు విపరీతంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నాయి.

Some Media Channels Negative Campaign On Sarkaru Vaari Paata Details, Mahesh Bab

ఈ వీకెండ్ లో సర్కారు వారి పాట సినిమాను చూడాలని భావిస్తున్న వాళ్లు సైతం వెనక్కు తగ్గేలా పరిస్థితులు ఉన్నాయి.కొన్ని ఛానెళ్లు వైసీపీ ప్రభుత్వంపై ఉన్న కోపంతో సర్కారు వారి ఫ్లాపులు అంటూ ప్రచారం చేసిన కథనాలు సైతం ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.సర్కారు వారి పాట సినిమాపై కొన్ని ప్రముఖ న్యూస్ ఛానెళ్లు సైతం విషం కక్కి ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు