పెళ్లి కావడం లేదని సాఫ్ట్ వేర్ ఆత్మహత్య..!!

సదాశివనగర్ మండలం అడ్లుర్ ఎల్లారెడ్డి లో విషాదం చోటుచేసుకుంది.ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజ్ కుమార్ ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు.

ముంబైలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా రాజ్ కుమార్.పెళ్లి కావడం లేదని మనస్తాపానికి గురై.

దాదాపు మూడు నాలుగు నెలల నుండి డిప్రెషన్లోకి వెళ్లి పోయి ఇంటిలో ఉరి వేసుకోవడం జరిగింది.  4, 5 సంబంధాలు వచ్చినా వాటిని రిజెక్ట్ చేయడం జరిగిందట.

ఈ క్రమంలో తాను జీవితంలో చాలా అనుభవించడం జరిగిందని, ఇక ఈ జీవితం చాలు అంటూ సుసైడ్ నోట్ లో రాసి.తన పేరిట ఉన్న ఆస్తి తన అక్క కొడుకు కి కూతురికి చెందాలని కోరాడు.

Advertisement

కేవలం 28 సంవత్సరాలు వయసు కలిగిన రాజ్ కుమార్ మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.పెళ్లి కావడం లేదన్న మనస్థాపం తోనే రాజకుమార్ చనిపోయినట్లు స్థానికులు కూడా చెబుతున్నారు.

చేతికి అందినా కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు