సోషల్ మీడియా ద్వారా ఈ స్పోర్ట్స్ స్టార్స్ ఎంత సంపాదిస్తారో తెలుసా?

సినిమా, స్పోర్ట్స్. ప్రపంచంలో మంచి క్రేజ్ ఉన్న రంగాలు.

వీటి ద్వారా పేరు ప్రఖ్యాతలుతో పాటు భారీగా డబ్బులూ వస్తాయి.

సినీ, క్రీడా తారలకు కోట్లాది మంది అభిమానులు సైతం ఉంటారు.

ఎక్కడికి వెళ్లినా ఆటోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్ అంటూ తెగ హడావిడి ఉంటుంది.అయితే తమకు సినిమాలు, క్రీడల ద్వారా వచ్చిన క్రేజ్ ను సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించుకునేందుకు ఉపయోగించుకుంటున్నారు సెలబ్రిటీలు.

ఆయా తారలకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను బ‌ట్టి సోషల్ మీడియాలో చేసే ఒక్కో పోస్టును బట్టి భారీగా డబ్బులు తీసుకుంటున్నారు.సినిమాలు, క్రీడల ద్వారా సంపాదించే డబ్బుకన్నా సోషల్ మీడియా ద్వారా సంపాదించే డబ్బులే ఎక్కువగా ఉండటం విశేషం.

Advertisement
Social Media Earning Of These Sports Stars, Sports Stars, Leo Messi, Ronaldo, Vi

సినిమా తారలతో పోల్చితే క్రీడాకారుడు సోషల్ మీడియా ద్వారా సంపాదించే డబ్బులే ఎక్కువ కావడం విశేషం.ప్రపంచంలో నలుగురు ఆటగాళ్లు ఒక్కో పోస్టుకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.

పలు బ్రాండ్లను సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు వెనుకేసుకుంటున్నారు.ఇంతకీ సోషల్ మీడియా ద్వారా కనీవినీ ఎరుగని రీతిలో సంపాదిస్తున్న ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

*క్రిస్టియానో రొనాల్డో

Social Media Earning Of These Sports Stars, Sports Stars, Leo Messi, Ronaldo, Vi

ప్రపంచంలో మేటీ ఫుట్ బాల్ ప్లేయర్ అయిన రొనాల్డోకు ఇన్ స్టాగ్రామ్ లో 308 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.ఆయన పెట్టే ప్రతి పోస్టుకు 11.9 కోట్ల రూపాయలు తీసుకుంటాడు.

*మెస్సీ

Social Media Earning Of These Sports Stars, Sports Stars, Leo Messi, Ronaldo, Vi

మరో అగ్ర ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీకి ఇన్ స్ట్రాగ్రామ్ లో 235 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.ఈయన పెట్టే ప్రతి పోస్టుకు 8.6 కోట్ల రూపాయలు తీసుకుంటాడు.

*Jr నెయ్ మార్

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
డిజాస్టర్ అని అప్పుడు డిక్లేర్ చేయండి.. రివ్యూల గురించి నాని షాకింగ్ రియాక్షన్ ఇదే!

బ్రెజిల్ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ అయిన నెయ్ మార్ కు ఇన్ స్ట్రాగ్రామ్ లో 153 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.ఈయన పెట్టే ప్రతి పోస్టుకు 6.1 కోట్ల రూపాయలు తీసుకుంటాడు.

*విరాట్ కోహ్లీ

Advertisement

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇన్ స్ట్రాగ్రామ్ లో 138 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.ఈయన పెట్టే ప్రతి పోస్టుకు సుమారు 5 కోట్ల రూపాయలు తీసుకుంటాడు.

తాజా వార్తలు