రియల్ హీరో: పొట్టిగా వుందని ఆమెని కించపరిచారు, కానీ అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, వారి గర్వాన్ని అణచింది!

అవును, మీరు విన్నది నిజమే.ఆమె మీలో చాలమందిలాగా శరీరానికి సంబందించి చాలా వివక్షను ఎదుర్కొంది.

ఈ క్రమంలో ఎత్తు బాగా తక్కువగా ఉండటం వల్ల ఆమెకి పెళ్లి కూడా జరగలేదట.అలాగని ఆమె డీలా పడిపోలేదు, ఏడుస్తూ ఓ మూలన కూర్చోలేదు కూడా.

ఎంతో ఎత్తైన, ఆజానుబావుల్లాంటి బాహుబలులకు కూడా సాధ్యం కానీ పనిని చేసి అందరి తలలు దించుకొనేలా చేసింది.అవును, ఆమె ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచు శిఖరాలను ఎక్కి నిరసన వ్యక్తం చేసింది.

పూణేకు చెందిన పర్వతారోహకురాలు స్మితా ఘుగే రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు.

Advertisement

ఈ ఆగస్టు 15న పూణేకు చెందిన స్మితా ఘుగే( Smita Ghuge ) రష్యాలోని ఎత్తైన శిఖరంపై 75 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మరో శిఖరాన్ని అధిరోహించారు.ఎత్తు తక్కువగా ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి ఆమె నిత్యం వేధింపులకు గురైనట్టుగా ఈ సందర్బంగా వాపోయింది.పెళ్లి కోసం అబ్బాయిని వెతుకుతున్నప్పుడు, చాలా మంది అబ్బాయిలు తన ఎత్తును సమస్యగా చూపించేవారని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా ఎత్తు తక్కువగా ఉందని, వరకట్నం( Dowry ) ఎక్కువగా కావాలని పెళ్లికి నిరాకరించేవారని చెప్పింది.

అయితే ఆమెని చూసి నేడు విధి తలదించుకుంది.ఈ క్రమంలో ఆమె తీవ్ర నిరాశకు గురైనప్పటికీ ఆమె అక్కడితో ఆగలేదు.మన ఎత్తు తక్కువగా ఉండడం వల్ల ఏమైంది, ఇప్పుడు మన ఎత్తును పెంచలేం.

కానీ కచ్చితంగా ఉన్నత శిఖారాలకు చేరుకోవచ్చునని మనసులో సంకల్పించుకుంది.ఇంకేముంది కట్ చేస్తే, పూణె( Pune )కు చెందిన ఆ యువతి తన ఎత్తుతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని భావించింది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?

అక్కడే ఆమె కలల ప్రయాణం మొదలైంది.కట్నం డిమాండ్ కు వ్యతిరేకంగా స్మిత ప్రయాణం మొదలైంది.

Advertisement

అబ్బాయిల కుటుంబాల నుంచి కట్నం డిమాండ్ ఆగడం లేదని గ్రహించిన స్మిత, ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన శిఖరాలపై దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది.నేడు ఆమె సాటి మహిళలపట్ల రోల్ మోడల్ లాగా అవతరించింది.

తాజా వార్తలు