వేస‌విలో వేధించే స్కిన్ రాషెస్‌కు ఈ చిట్కాల‌తో చెక్ పెట్టేయండి!

వేస‌వి కాలం వ‌చ్చేసింది.ఏప్రిల్ నెల ప్రారంభం అయ్యిందో లేదో.

భానుడు భగ భగ మంటుంటే.

జనాలు విల విలలాడిపోతుంటారు.

ఇక మండే ఎండ‌లు కార‌ణంగా జ‌నాలు బ‌య‌ట కాలు పెట్టేందుకే భ‌య‌ప‌డుతుంటారు.అయితే ఈ వేస‌విలో అల‌స‌ట, అధిక దాహం, నీర‌సం, చెమ‌ట‌లు వంటి స‌మ‌స్య‌ల‌తో పాటు స్కిన్ రాషెస్ స‌మ‌స్య కూడా ఎక్కువ‌గానే ఇబ్బంది పెడుతుంది.

ఎక్కువ ఎండ‌లో తిర‌గ‌డం, వ‌డ గాలి, వేడి వాతావ‌ర‌ణం ఇలా ర‌క‌ర‌కాల కాలంలో స్కిన్‌పై రాషెస్ ఏర్ప‌డ‌తాయి.ఇక వీటిని త‌గ్గించుకునేందుకు ఏవేవో క్రీములు వాడుతుంటారు.

Advertisement

అయితే ఇంట్లో కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే.సుల‌భంగా వేస‌విలో వేధించే స్కిన్ రాషెస్ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

మ‌రి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.స్కిన్ రాషెస్‌ను నివారించ‌డంలో తుల‌సి ఆకులు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

కొన్ని తుల‌సి ఆకుల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి.రాషెస్ వ‌చ్చిన ప్రాంతంలో అప్లై చేయాలి.

బాగా డ్రై అయిన త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే క్ర‌మంగా రాషెస్ త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

క‌ల‌బంద కూడా స్కిన్ రాషెస్‌కు చెక్ పెట్ట‌గ‌ల‌దు.ఇంట్లో పెరిగే క‌ల‌బంద నుంచి గుజ్జు తీసుకుని.ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి రెండు నిమిషాల పాటు మర్ధన చేయాలి.

Advertisement

అర గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజూ చేస్తే.

రాషెస్ త‌గ్గ‌డంతో పాటు వాటి వ‌ల్ల వ‌చ్చే మంట‌, వాపు కూడా త‌గ్గుతాయి.ఇక టీ ట్రీ ఆయిల్‌తో కూడా స్కిన్ రాషెస్‌ను నివారించుకోవ‌చ్చు.

ఒక బౌల్‌లో కొద్దిగా టీ ట్రీ ఆయిల్ మ‌రియు వాట‌ర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని రాషెస్ వ‌చ్చిన ప్రాంతంలో పూసి.

ఇర‌వై నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేసినా.

రాషెస్ మ‌టుమాయం అవుతాయి.

తాజా వార్తలు