శ్రీహాన్ గురించి అలాంటి కామెంట్లు చేసిన సిరి హన్మంత్.. క్లారిటీ ఇదే అంటూ?

యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న క్యూట్ కపుల్స్ లో సిరి హన్మంత్, శ్రీహాన్ జోడీ ఒకటనే సంగతి తెలిసిందే.

సిరి హన్మంత్ బిగ్ బాస్ షోకు వెళ్లడానికి ముందే శ్రీహాన్, సిరి హన్మంత్ లకు నిశ్చితార్థం జరిగింది.

సిరి హన్మంత్, శ్రీహాన్ కలిసి కొన్ని యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్ లు చేయగా వాటికి సైతం ఊహించని స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.అయితే బిగ్ బాస్ షో వల్ల శ్రీహాన్, సిరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

షణ్ముఖ్ జశ్వంత్ తో సిరి సన్నిహితంగా ఉండటం వల్లే షణ్ముఖ్ దీప్తి సునైనా మధ్య బ్రేకప్ జరిగిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.బిగ్ బాస్ షో నుంచి సిరి బయటకు వచ్చిన తర్వాత తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్లను, ట్రోల్స్ ను చూసి సిరి హన్మంత్ షాకయ్యారు.తనపై వచ్చిన ట్రోల్స్ వల్ల సిరి ఒత్తిడికి గురయ్యారు.

అయితే ఆ సమయంలో కూడా శ్రీహాన్ నుంచి సిరి హన్మంత్ కు ఊహించని స్థాయిలో సహకారం లభించింది.

Advertisement

అయితే బిగ్ బాస్ షో తర్వాత సిరి శ్రీహాన్ మధ్య దూరం పెరిగిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఆ వార్తలకు చెక్ పెట్టారు.తాజాగా సిరి ఇన్ స్టాగ్రామ్ ద్వారా శ్రీహాన్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ శ్రీహాన్ మంచిలోనైనా చెడులోనైనా ప్రతి క్షణం నా పక్కన నిలిచే వ్యక్తి అని ఆమె వెల్లడించారు.

శ్రీహాన్ మంచి మనస్సు ఉన్న వ్యక్తి అని సిరి పేర్కొన్నారు.నా గార్డియన్, నా మార్గదర్శి, నా బలం, సర్వస్వం శ్రీహాన్ అని సిరి వెల్లడించారు. మై వన్ అండ్ ఓన్లీ శ్రీహాన్ అంటూ సిరి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

సిరి చేసిన పోస్ట్ కు లక్షల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి.శ్రీహాన్ తో తనకు ఎటువంటి విభేదాలు లేవని సిరి మరోసారి క్లారిటీ ఇచ్చేశారు.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు