వామ్మో.. కార్లను అమాంతం మింగేసిన భూమి!

ప్రకృతి ప్రకోపిస్తే ఏమైనా ఉంటుందా? ఒకవైపు ఇప్పటికే కొవిడ్‌ వైరస్‌ వల్ల అతలాకుతలమవుతుంటే.మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు కూడా కలవరపెడుతున్నాయి.

ఇప్పటి వరకు అడవులను నరుకుతూ, వాతావరణాన్ని కాలుష్యం చేస్తూ మనం నాశనం చేశాం.చేస్తూనే ఉన్నాం.

ఇప్పుడు ప్రకృతి మనతో ఆడుకుంటుంది.దీనికి నిదర్శనం మెక్సికోలో జరిగిన ఓ సంఘటన.

ఈ ఘటనలో భూమి ఉన్నట్టుండి ఆకస్మాత్తుగా కుంగిపోయింది.దీంతో ఆ ప్రాంతంలో పెద్ద గుంత ఏర్పడింది.

Advertisement
Sinkhole Swallows Cars In Jerusalem, Sinkhole Swallows Cars In Jerusalem . Car P

ఇటువంటి ఘటనే మరొకటి జెరుసలేంలో జరిగింది.ఓ పార్కింగ్‌ సెంటర్‌లో ఒక్కసారిగా భూమి కుంగిపోయింది.

ఆ ప్రాంతంలో పార్కింగ్‌ చేసిన కార్లు ఆ భారీ గుంతలోకి పడిపోయాయి.ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న విపత్తు నిర్వాహణ బృందాలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి.

అదృష్టవశాత్తు ఆ సమయంలో కార్లలో ఎవరూ లేరు.దీంతో ప్రాణాపాయం తప్పింది.

ఈ దృశ్యాలు పార్కింగ్‌ ప్రాంతంలోని సీసీటీవీలో నమోదయ్యా యి.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.అసలు కళ్లు తెరచి మూయగానే మూడు కార్లను భూమి ఆమాంతం మింగిన దృశ్యాలు సీసీ టీవీ ఫూటే జీల్లో చూస్తూంటే నమ్మÔ¶ క్యంగా అనిపించడం లేదు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!

కానీ, అక్కడి పోలీసు అధికారులు మాత్రం ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొంత సమీపంలో టన్నెల్‌ నిర్మాణంలో ఉందని, అది పార్కింగ్‌ స్థలానికి కిందే ఉండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.టన్నెల్‌ నిర్మాణం పూర్తికాకుండానే అక్కడ కార్లను నిలిపేందుకు అనుమతి ఇవ్వడంతో నేల కుంగిపోయిందన్నారు.

Sinkhole Swallows Cars In Jerusalem, Sinkhole Swallows Cars In Jerusalem . Car P
Advertisement

ఇలాంటి ఘటనే మరోటి వారం రోజుల కిందట మెక్సికోలోని ప్యూబ్లాలో ఓ వ్యవసాయ క్షేత్రంలో 300 అడుగుల విస్తీర్ణంలో భూమి కుంగిపోయింది.శాంతా మారియా జ్యాకాటేపక్‌ అనే పట్టణంలో ఏర్పడిన ఈ సింక్‌ హోల్‌ పరిసర ప్రాంతాల్లో ఇళ్లను కూడా మింగేసే ప్రమాదం ఉందని ప్రజలు వణికిపోతున్నారు.ఏ ప్రాంతంలో భూమి కుంగిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు.

ఈ గొయ్యి ఏర్పడిన తర్వాత భారీగా నీరు చేరింది.ఇప్పుడు ఆ గుంత నుయ్యిని తలపిస్తోంది.

ప్రకృతి మనపై విరుచుకు పడిందంటే దాన్నుంచి ఎలా తప్పించుకునేది.ఛాన్సే లేదు.

బయట దేశాల్లో ఇలాంటి ఘటనలు ఏదో ఒక ప్రాంతంలో తరచూ జరుగుతూనే ఉంటాయి.

తాజా వార్తలు