అబ్బో చాలా చేశావ్‌గా.. భర్తపై గీతామాధురి కామెంట్స్ వైరల్..?

తెలుగులో స్టార్ సింగర్ గా గీతమాధురి మంచి గుర్తింపును సంపాదించుకోగా నటుడిగా నందు మంచి పేరు తెచ్చుకున్నారు.

బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో నందు హీరోగా నటించగా ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ గీతామాధురి, నందు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు ఎవరైనా తమను ట్రోల్ చేస్తే సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.గతంలో థంబ్ నెయిల్స్ పై, మీమ్స్ పై నందు సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే.

ఒక వ్యక్తి గీతామాధురి ఫోటోలతో గీతామాధురి హీరోయిన్ అయి ఉంటే మా పరిస్థితి ఏమిటని హీరోయిన్లు అనుకుంటున్నట్టు మీమ్ ను క్రియేట్ చేశారు.ఆ మీమ్ గురించి నందు స్పందిస్తూ మరి కలిసి ఏదైనా స్క్రిప్ట్ ను సిద్ధం చేద్దామా.? అని కామెంట్ చేశారు.ఆ కామెంట్ గురించి గీతామాధురి స్పందిస్తూ "అబ్బో చాలా చేశావుగా.

నాకు అంత లేదని నీకు తెలుసుగా" అంటూ కామెంట్లు పెట్టారు.

Advertisement

మరోవైపు బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొని గీతా మాధురి సీజన్ 2 రన్నర్ గా నిలిచారు.కౌశల్ గట్టి పోటీని ఇవ్వడంతో గీతామాధురి రన్నర్ గా నిలిచారు.బిగ్ బాస్ సీజన్ 4లో నందు పాల్గొంటాడని జోరుగా ప్రచారం జరగగా ఆ షోలో మాత్రం నందు పాల్గొనలేదు.

మరోవైపు బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో నందుకు జోడీగా స్టార్ యాంకర్ రష్మీ నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.ఈ సినిమాతో నందు హీరోగా సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతోంది.కరోనా విజృంభణ తగ్గిన తరువాత ఈ సినిమా రిలీజవుతుందేమో చూడాల్సి ఉంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు