మమ్మల్ని కలపడానికి ఆ హీరో చేయని ప్రయత్నాలు లేవు... సింగర్ చిన్మయి కామెంట్స్ వైరల్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ చిన్మయి శ్రీపాద(Chinmayi Sripada) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తన అద్భుతమైన గాత్రంతో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె మీటూ ఉద్యమం ద్వారా రచయిత వైరముత్తు పట్ల ఆరోపణలు చేస్తూ వార్తలలో నిలిచారు.

అదే విధంగా సమాజంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలుస్తూ తరచు వార్తల్లో నిలుస్తుంటారు.ఇకపోతే రాహుల్ రవీందర్ (Rahul Ravinder) ను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు రాహుల్ రవీందర్.ఈయన దర్శకుడిగా నిర్మాతగా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇకపోతే తాజాగా రాహుల్ చిన్మయి దంపతులు బుల్లితెరపై వెన్నెల కిషోర్ (Vennela Kishore) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అలా మొదలైంది కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ వారి పరిచయం ప్రేమ పెళ్లి గురించి ఎన్నో విషయాలు తెలియచేశారు.

Advertisement

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా వారిద్దరి పరిచయం ప్రేమ పెళ్లి గురించి తెలియజేశారు.వెన్నెల కిశోర్ మాట్లాడుతూ.మంచితనానికి మాశ్చురైజర్ చేస్తే రాహుల్ అని, సత్యానికి శానిటైజ్ పెడితే చిన్మయి అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

  రాహుల్ మాట్లాడుతూ చిన్మయి డబ్బింగ్ చెబుతూ ఈ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు అని అనుకుందట ఈ విషయం తర్వాత నాకు చెప్పిందని రాహుల్ చెప్పగా ఈయన ఏదో వాగుతున్నాడనీ చిన్మయి తెలిపారు.

రాహుల్ ను చూసే వరుకు నాకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదని తెలిపారు.ఈ సందర్భంగా ఈ జంటను కలిపిన హీరో గురించి తెలిపారు. సందీప్ కిషన్ (Sandeep Kishan)నువ్వు రాహుల్ని కలవాలి, అతడిని మీట్ అవ్వాలి అని అన్నాడట.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

ఆమాట అనగానే.సందీప్ తనకోసం మార్కెటింగ్ మొదలు పెట్టాడని  రాహుల్ కామెంట్ చేశాడు.

Advertisement

అలా వీరిద్దరిని సందీప్ కిషన్ కలిపారని తెలిపారు.

తాజా వార్తలు