తలపై తలపాగా.. సిక్కులను ‘‘సత్ శ్రీ అకాల్’’ అంటూ పలకరింపు, సింగపూర్ ప్రధానిపై ప్రశంసలు

ప్రపంచవ్యాప్తంగా సిక్కులు అన్ని దేశాల్లోనూ స్థిరపడిన సంగతి తెలిసిందే.ఇందులో సింగపూర్ కూడా ఒకటి.

ఈ నేపథ్యంలో సిక్కు సమాజం పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు సింగపూర్ ప్రధానమంత్రి లీ సేన్ లూంగ్.శనివారం పునరుద్దరించబడిన గురుద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన తలపాగా ధరించారు.తలపై తెల్లటి తలపాగా ధరించిన లూంగ్ అక్కడితో ఆగలేదు.

సిలత్ రోడ్‌లోని ఈ గురుద్వారాలో సిక్కులు సాంప్రదాయబద్ధంగా చెప్పుకునే ‘‘సత్ శ్రీ అకాల్ ’’తో అందరినీ పలకరించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి.సింగపూర్ ప్రధానిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

తలపాగా ధరించిన లూంగ్.భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌‌లాగే వున్నారంటూ నెటిజన్లు పోల్చారు.

Advertisement

గురుద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో లూంగ్ మాట్లాడుతూ.కోవిడ్ విపత్కరకాలంలో జాతి, మతంతో సంబంధం లేకుండా ప్రజలకు సహాయ కార్యక్రమాలను అందించినందుకు గాను సిక్కు సమాజాన్ని ఆయన ప్రశంసించారు.

సిలట్ రోడ్ ఆలయంతో పాటు ఇతర గురుద్వారాలు కోవిడ్ వల్ల మూసివేతకు గురయ్యాయని లీ అన్నారు.

సెంట్రల్ సిఖ్ గురుద్వారా బోర్డు అధ్యక్షుడు బల్జీత్ సింగ్ ఆధ్వర్యంలో గురుద్వారా పునరుద్ధరణ పనులు జరిగాయి.పునర్నిర్మాణ పనుల తర్వాత ఈ గురుద్వారాలో వంటగది, ఆహారం తయారీ, భోజనశాలను సుమారు 20 శాతం మేర విస్తరించారు.ఇక్కడ రోజుకు 2,000 మంది వరకు భోజనం చేసేందుకు వీలు వుంది.

కోవిడ్ తదుపరి ఎదురైన ఇబ్బందుల నుంచి ప్రజల నుంచి రక్షించేందుకు గాను సిక్కులు ‘‘ప్రాజెక్ట్ అకాల్’’ పేరిట అనుసంధాన కమిటీగా ఏర్పడి దాదాపు 13,000 వేల మందికి అండగా నిలిచారు.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

కాగా, సింగపూర్ వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం సోమవారం నాటికి నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు అక్కడ కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 62,630కి చేరింది.అలాగే శనివారం నాటికి 57,06,932 మందికి వ్యాక్సినేషన్ జరిగింది.3.55 మిలియన్ల మంది కనీసం ఒక్క డోసైనా తీసుకోగా, 2.16 మిలియన్ల మంది రెండు డోసులూ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు