ప్రముఖ నటి నిహారిక కొణిదెల ఆస్తుల విలువెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

మెగా డాటర్ నిహారిక( Niharika Konidela ) ఈ మధ్య కాలంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

భర్త చైతన్యతో నిహారిక విడిపోతారని వార్తలు వినిపిస్తున్నా అధికారికంగా స్పష్టత వస్తే మాత్రమే ఈ వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశం అయితే ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

అయితే నిహారిక ఆస్తుల విలువ తెలిసి నెటిజన్లు సైతం ఒకింత షాకవుతున్నారు.

నిహారిక 1993 సంవత్సరం డిసెంబర్ నెల 18వ తేదీన జన్మించారు.సెయింట్ మేరీస్ కాలేజ్ లో చదువుకున్ననిహారిక ఢీ జూనియర్ షో ద్వారా యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టారు.యాంకర్ గా సక్సెస్ అయిన నిహారిక ఒక మనసు సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

తెలుగుతో పాటు పలు తమిళ వెబ్ సిరీస్ లలో ( Web Series )కూడా ఆమె నటించడం గమనార్హం.

Advertisement

వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరించి సక్సెస్ అయిన నిహారిక హీరోయిన్ గా ఒక్కో ప్రాజెక్ట్ కు 25 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకున్నారని తెలుస్తోంది.ఈ నటి ఆస్తుల విలువ 30 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అని సమాచారం అందుతోంది.నిహారికకు సొంతంగా జర్మనీ లగ్జరీ బ్రాండ్స్ లో ఒకటైన ఆడి కారు( Audi Car ) కూడా ఉందని తెలుస్తోంది.

నిహారిక పలు వ్యాపారాలలో కూడా ఎంట్రీ ఇస్తూ మహిళా వ్యాపారవేత్తగా కూడా సత్తా చాటుతున్నారు.నిహారిక ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు.కొన్నిరోజుల క్రితం నిహారిక సొంతంగా ఆఫీస్ ను మొదలుపెట్టారు.

నిహారికకు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా నిహారిక జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు