వైసీపీకి వ్యతిరేకంగా వస్తున్న సర్వేలను నమ్మాలా? వద్దా? అసలు వాస్తవాలు ఇవే!

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ( YCP )కి కొన్ని సర్వేలు అనుకూలంగా ఉంటే మరికొన్ని సర్వేలు పూర్తిస్థాయిలో వ్యతిరేకంగా ఉన్నాయి.వైసీపీకి అనుకూలంగా ఉన్న సర్వేలను నమ్మాలా? వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న సర్వేలను నమ్మాలా? అనే ప్రశ్నలకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో ఏ పార్టీకి పూర్తిస్థాయిలో అనుకూల పరిస్థితులు లేవు.

మెజారిటీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు న్యూట్రల్ ఓటర్ల చేతిలో ఉంది.తమ పార్టీదే విజయం అని కూటమి, వైసీపీ చెబుతున్నా 50కు పైగా నియోజకవర్గాల్లో పోటాపోటీ పరిస్థితులు ఉన్నాయి.

ఈ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో చెప్పే పరిస్థితి లేదు.అందువల్ల ఏ పార్టీకైనా పూర్తిస్థాయిలో అనుకూలంగా ఫలితాలు ఉంటే ఆ సర్వేలను నమ్మాల్సిన అవసరం లేదు.

మెజారిటీ సర్వే సంస్థలు( AP Political Survey ) తూతూమంత్రంగా సర్వేలను నిర్వహిస్తున్నాయి.

Advertisement

సర్వేల ఫలితాలు నూటికి నూరు శాతం నిజమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.ప్రస్తుతానికి కూటమితో పోల్చి చూస్తే వైసీపీ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.అయితే ఈ ఫలితాలే కచ్చితమైన ఫలితాలు అని చెప్పే పరిస్థితి లేదు.

మేనిఫెస్టోలు ఏ పార్టీ గెలుపులో అయినా కీలక పాత్ర పోషిస్తాయి.అయితే ఇటు వైసీపీ నుంచి కానీ అటు కూటమి నుంచి కానీ తుది మేనిఫెస్టో( YCP Manifesto ) ఇంకా రిలీజ్ కాలేదు.

వైసీపీ, టీడీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందడుగులు వేస్తూ గెలుపు కోసం ఎంతో కష్టపడుతున్నాయి.టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఆశించిన ఫలితాలను అందిస్తుందో లేదో చూడాలి.ఇరు పార్టీల నేతలు ఇంటింటా ప్రచారం చేస్తూ గెలుపు కోసం తీవ్రస్థాయిలో శ్రమిస్తుండటం గమనార్హం.

ఏపీకి జగన్ ముఖ్యమంత్రి అవుతారో లేక చంద్రబాబు సీఎం అవుతారో చూడాలి.ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే విషయంలో ఇతర రాజకీయ పార్టీలు సక్సెస్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు