CM Jagan : అక్కడి నుంచే షర్మిల పోటీ.. వారికి కీలక సూచనలు చేసిన జగన్

రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఎన్నికలతో పాటు, కడప ఎంపీ స్థానం పైన అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది.

దీనికి కారణం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసే ఆలోచనతో ఉండడమే కారణం.

ప్రస్తుతం ఇక్కడ వైసిపి సెట్టింగ్ ఎంపీగా వైస్ అవినాష్ రెడ్డి ఉన్నారు.అలాగే మాజీ మంత్రి ,దివంగత నేత వైస్ వివేకానంద రెడ్డి( Ys Vivekananda Reddy ) కుటుంబ సభ్యుల్లో ఒకరు ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో, కడప ఎంపీ స్థానంపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( CM Jagan ) ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

కడప అసెంబ్లీ తోపాటు, ఎంపీ స్థానంలోనూ భారీ మెజారిటీ వచ్చేలా జగన్ వ్యవహరచన చేస్తున్నారు.ఇక్కడి నుంచి సొంత కుటుంబ సభ్యులే తమ ప్రత్యర్థులుగా పోటీకి దిగుతుండడంతో దానికి తగ్గట్లుగానే జగన్ రాజకీయవ్యూహాలు పన్నుతున్నారు.

వైస్ కుటుంబ సభ్యుల మధ్యనే పోటీ నెలకొనడంతో, వైస్ అభిమానుల్లో గందరగోళం ఏర్పడకుండా జాగ్రత్తలు పడుతున్నారు.దీనిలో భాగంగానే కడప జిల్లా పార్టీ నేతలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో కడప ఎంపీ వైస్ అవినాష్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

ఈ సందర్భంగా అక్కడ రాజకీయ పరిస్థితుల గురించి జగన్ ఆరా తీశారు.తమ రాజకీయ ప్రత్యర్థులకు ఎక్కడా అవకాశం దొరక్కుండా పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లే విధంగా ఏం చేయాలనే దానిపైన జగన్ క్లారిటీ ఇచ్చారు.

అలాగే త్వరలో ప్రారంభం కాబోతున్న బస్సు యాత్ర పైన జగన్ వారితో చర్చించారు.వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలోని అన్ని సీట్లు గెలవబోతున్నట్లుగా జగన్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బిజెపి, టిడిపి, జనసేన కూటమి ప్రభావం ఎంతవరకు ఉంటుందనే దానిపైన వారితో చర్చించినట్లు సమాచారం.అలాగే షర్మిల అంశాన్ని ఈ సమావేశంలో కీలకంగా చర్చించారట.షర్మిల( Sharmila ) కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం కడపతో పాటు, మిగిలిన రాయలసీమ జిల్లాల్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనే దానిపైన చర్చించి కొన్ని కీలక సూచనలు చేశారట.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు