బీఆర్ఎస్ కు షాకిచ్చిన శానంపుడి...!

సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో అధికారం కోల్పోయి కంగారు పడుతున్న కారుపార్టీకి ఆ పార్టీ నేతలు షాకుల మీద షాకులిస్తున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించిన వారు అధికారం పోగానే పక్కచూపులు చూస్తున్నారు.

ఆ కోవలోనే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి కూడా చేరిపోయారు.ఆదివారం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు.

నల్లగొండ పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచే అవకాశం ఉందని,ఆ హామీతోనే కమలంపై కన్నేసినట్లు జిల్లా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.దీనితో హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో గులాబీ పార్టీకి ఇది గట్టి దెబ్బగనే చెప్పాలి.

ఇదిలా ఉంటే ఇంత స్వచ్చంద సంస్థ ద్వారా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ,గత ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి,చివరికి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి ఎమ్మేల్యే అభ్యర్ధిగా బరిలో నలిచిన పిల్లుట్ల రఘు బీఆర్ఎస్ లో చేరి నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.

Advertisement
జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!

Latest Suryapet News