సీరియల్ హీరోయిన్ పల్లవిని బ్యాన్ ఎందుకు చేశారు..?

ప‌ల్ల‌విగౌడ‌.ప్ర‌ముఖ తెలుగు సీరియల్ ప‌సుపు కుంకుమ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది ఈ క‌న్న‌డ భామ‌.

ఇందులో అంజ‌లి పాత్ర‌లో న‌టించి ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది.అనంత‌రం సావిత్ర అనే సీరియ‌ల్ చేసింది.

కార‌ణాలు ఏంటో తెలియ‌దు కానీ కొద్ది రోజుల త‌ర్వాత ఆమె దాని నుంచి త‌ప్పుకున్న‌ది.ప్ర‌స్తుతం ఫిదా అనే డ‌బ్బింగ్ సీరియ‌ర్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది.

నిజానికి తాను యానిమేష‌న్ రంగంలోకి అడుగుపెట్టాలనుకున్న‌ట్లు చెప్పింది.అనుకోకుండా టీవీరంగంలోకి వ‌చ్చిన‌ట్లు చెప్పింది.

Advertisement
Serial Actress Pallavi Gowda Banned From Tv Industry , Serial Actress Pallavi, P

త్వ‌ర‌లో మ‌ళ్లీ తెలుగు సీరియ‌ల్స్ చేస్తానని వెల్ల‌డించింది.ఇక తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాలు చెప్పింది.

ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ లో త‌న‌పై బ్యాన్ విధించిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు.సావిత్రి సీరియ‌ల్ చేసే స‌మ‌యంలో వేరే ఏ తెలుగు సీరియ‌ల్ లో నటించ‌న‌ని అగ్రిమెంట్ చేసిన‌ట్లు వెల్ల‌డించింది.

అయితే చేసిన సీరియ‌ల్ కు సంబంధించి పేమెంట్స్ స‌రిగా ఇవ్వ‌లేదు.రెండు నెల‌ల పాటు ఇదే తంతు కొన‌సాగింది.

ఈనేప‌థ్యంలో త‌న‌కు వేరే సీరియ‌ల్ లో చేయాల‌నే అవ‌కాశం వ‌స్తే చేస్తాను అని చెప్పాను.అందుకు వాళ్లు ఒప్పుకోలేదు.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
నాని ని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఏంటో తెలుసా..?

పెండిగ్ పేమెంట్ ఇవ్వ‌మ‌న్నా ఇవ్వ‌లేదు.మ‌నీ ప్రాబ్లం వ‌ల్ల వేరే సీరియ‌ల్ చేస్తాన‌ని చెప్ప‌డంతో త‌న‌ను ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ లో బ్యాన్ చేశార‌ని చెప్పింది.

Serial Actress Pallavi Gowda Banned From Tv Industry , Serial Actress Pallavi, P
Advertisement

అటు ప‌ల్ల‌వి వ్య‌క్తిగ‌త జీవితం కూడా సాఫీగా సాగ‌డం లేదు.మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా త‌న భ‌ర్త‌తో విడిపోయింది.కొద్ది రోజుల క్రితం విడాకులు కూడా తీసుకున్న‌ట్లు తెలిపింది.

ప్ర‌స్తుతం త‌న జీవితంలో జ‌రిగిన చేదు ఘ‌ట‌న‌ల‌ను మ‌ర్చిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు చెప్పింది.త‌న కుటుంబంతో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్న‌ట్లు వెల్ల‌డించింది.

అటు షూటింగుల్లో బిజీగా గ‌డుపుతూ గ‌త జ్ఞాప‌కాల నుంచి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు ప‌ల్ల‌వి వెల్ల‌డించింది.

తాజా వార్తలు