ఒక్క ఫోన్ కాల్... కాంగ్రెస్ లో రాజుకున్న మంట ?

ఉప ఎన్నికలు కానీ,  సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కానీ రాకుండా తెలంగాణ రాజకీయాలు వేడెక్కిపోయి.అన్ని పార్టీలు ఎన్నికలు వచ్చినంత హడావుడి చేస్తున్నాయి.

టిఆర్ఎస్, బిజెపి , కాంగ్రెస్ , వైఎస్సార్ టిపి, ఇలా అన్ని పార్టీలు ప్రజల్లో తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో కదలిక వచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఆ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారు అనుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువు కౌశిక్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.  ఆయన టిఆర్ఎస్ తరఫున తనకు టిక్కెట్ కన్ఫామ్ అయ్యింది అంటూ మాట్లాడిన ఫోన్ కాల్ వ్యవహారం ఎన్నో సంచలన పరిణామాలు చోటు చేసుకోవడానికి కారణం అయింది.

Advertisement

ఇటీవల టిఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిన విజేందర్ తో కౌశిక్ ఫోన్ కాల్ మాట్లాడడం , అది కాస్త బయటకు లీక్ కావడంతో ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీరియస్ అయ్యింది.కౌశిక్ రెడ్డి కి షోకాజ్ నోటీసు ఇవ్వడంతో పాటు,  పార్టీ నుంచి బహిష్కరించింది.అయితే తనను కాంగ్రెస్ బహిష్కరించడం ఏమిటి పార్టీకి తానే రాజీనామా చేస్తున్నా అంటూ కౌశిక్ రెడ్డి ప్రకటించడంతో పాటు,  పిసిసి చీఫ్ రేవంత్ తో పాటు, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పైన కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.50 కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ పిసిసి చీఫ్ అయ్యాడు అంటూ విమర్శించారు.

అంతేకాదు టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.ఈ వ్యవహారం తర్వాత రేవంత్ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ లో ఇంకా ఇంటి దొంగలు ఎవరైనా ఉంటే త్వరగా సర్దేసుకోవాలని, ఎవరిని ఉపేక్షించేది లేదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.ఇక ఉత్తమ్కుమార్ రెడ్డి సైతం కౌశిక్ రెడ్డి పైన విమర్శలు చేశారు.

కౌశిక్ రెడ్డి చేసిన ఒక్క ఫోన్ కాల్ వ్యవహారం తో కాంగ్రెస్ తో పాటు, తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలకు కారణంగా నిలిచింది.కౌశిక్ రెడ్డి తో మొదలైన దుమారం మరి కొంత కాలం పాటు కాంగ్రెస్ ను  కుదిపేసే అవకాశం కనిపిస్తోంది.

   .

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు