మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించిన ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగినా, యాక్షన్‌కు ఏమాత్రం కొదువ లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఇక గోపీచంద్‌కు చాలా కాలం తరువాత సూపర్ హిట్ పడటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతోంది.అటు కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా అదిరగొడుతోంది.ఈ సినిమా తొలి మూడు రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.6.50 కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టింది.ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.
దీంతో ఈ సినిమాకు రాబోయే రోజుల్లో మంచి కలెక్షన్లు రావడం ఖాయమని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన అందాల భామ తమన్నా హీరోయిన్‌గా నటించగా, మణిశర్మ సంగీతం అదనపు బలంగా నిలిచింది.
చాలా రోజుల తరువాత పూర్తి యాక్షన్ సినిమాలో గోపీచంద్ నటించిన విధానం బాగుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.అయితే ఈ సినిమాకు అసలు పరీక్ష మాత్రం సోమవారం నుండి ఎదురుకానుంది.
వీకెండ్‌లో అదరగొట్టిన సీటీమార్ చిత్రం వీక్‌డేస్‌లో ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందో చూడాలి.కాగా ఈ సినిమా తొలి మూడు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో రాబట్టిన కలెక్షన్లు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.నైజాం - 1.79 కోట్లు సీడెడ్ - 1.24 కోట్లు గుంటూరు - 76 లక్షలు ఉత్తరాంధ్ర - 73 లక్షలు ఈస్ట్ - 64 లక్షలు వెస్ట్ - 36 లక్షలు కృష్ణా - 37 లక్షలు నెల్లూరు - 34 లక్షలు టోటల్ ఏపీ+తెలంగాణ - 6.23 కోట్లు కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా - 21 లక్షలు ఓవర్సీస్ - 6 లక్షలు టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు - రూ.6.50 కోట్లు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy