పుష్ప సిగ్నేచర్ స్టెప్ వెనుక దాగి ఉన్న అర్థం ఏంటో చెప్పేసిన బన్నీ?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప.

ఈ సినిమా విడుదల అయ్యి 350 కోట్లను వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది.

ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ స్టైల్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పాలి.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఒక భుజం పైకి ఎత్తి నడవడం అలాగే తగ్గేదేలే అనే సిగ్నేచర్ మూమెంట్ చిన్న వారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

ఇకపోతే ఈ సినిమాతో నార్త్ లో ఎంతో మంచి ఆదరణ పొందిన అల్లు అర్జున్ ఏకంగా ఇండియా టుడే మ్యాగజైన్ కవర్ పేజీపై తన ఫోటో పడటంతో నార్త్ ఇండియాలో కూడా అతనికి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం అవుతుంది.ఇండియా టుడే పత్రికతో నిర్వహించిన ఇంటర్వ్యూలో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన సిగ్నేచర్ మూమెంట్ గురించి దాని వెనుక ఉన్న అసలు విషయం గురించి బయట పెట్టారు.

Pushpa Film, Srivalli Song, Pushpa Signature Step, Rashmika Mandanna, Tollywood,
Advertisement
Pushpa Film, Srivalli Song, Pushpa Signature Step, Rashmika Mandanna, Tollywood,

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అల్లు అర్జున్ పుష్ప రాజ్ సిగ్నెచర్ స్టెప్ గురించి బన్నీ స్పందిస్తూ.డైరెక్టర్ సుకుమార్ గారు ఏమి ఆలోచిస్తున్నారు అతను ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయం నాకు ఏమాత్రం తెలియదు.అయితే ఆయన చెప్పిన విధంగానే నేను నడవాలి నా భుజం పైకి నడవడంతోపాటు నా బాడీ లాంగ్వేజ్ కూడా మార్చాను.

ఆయన ఏ ఉద్దేశంతో అలా చెప్పారో తెలియదు కానీ ఆయన చెప్పిన విధంగానే నేను చేశాను అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ తెలిపారు.మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించి భుజం నొప్పి కూడా వచ్చింది.

అయితే ఆ తర్వాత అలవాటైపోయిందని అల్లు అర్జున్ ఈ సందర్భంగా వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు