సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 373 జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఇల్లంతకుంట మండల కేంద్రంలో గౌడ సంఘ భవనంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్( Sarvai Papanna Goud ) 373 జయంతి వేడుకలు ఇల్లంతకుంట గౌడ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

పాపన్న బలహీన వర్గాల నాయకుడని వారి అభ్యున్నతి కోసం పాటుపడ్డాడని నాయకులు అన్నారు.

ఆయన సమాజానికి చేసిన సేవలు కొనియాడుతూ అతని ఆశయాలకోసం కృషి చేస్తామని గౌడ సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట గ్రామ గౌడ సంఘ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కొయ్యడ రాజయ్య( Rajaiah ),అంతటి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కొయ్యడ భాస్కర్, అంతటి బాలయ్య, బండారు సత్తయ్య,అంతటి రమేష్,ముత్యం మల్లయ్య,గైని మల్లేశం, బండారు రాజు, కొయ్యడ రామచందర్, అంతటి సత్యం, కొయ్యడ పర్శరం, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

అనారోగ్య బాధితులకు ఆర్దికంగా అండ తక్షణమే సహాయం అందించిన జిల్లా కలెక్టర్

Latest Rajanna Sircilla News