శనిదోషం నుంచి బయట పడాలంటే సంక్రాంతి రోజు ఈ చిన్న పనిచేస్తే చాలు!

చాలామంది వారి జాతక దోషాలు శని ప్రభావం ఉన్న కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.

ఈ క్రమంలోనే శని ప్రభావం దోషం నుంచి బయట పడటం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే శని దోషం నుంచి బయటపడటానికి మకర సంక్రాంతి ఎంతో అనువైన రోజు అని పండితులు చెబుతున్నారు.మకర సంక్రాంతి రోజు సూర్య దేవుడిని పూజించడం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.

Sankranti Day To Remove Sani Dhosham Sani Dosam, Get Rid, Worship, Hindu Belives

మకర సంక్రాంతికి సూర్య దేవుడిని పూజించడం, శని తొలగిపోవడానికి సంబంధం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

అందుకే మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.మకర రాశికి శని అధిపతి కనుక సూర్యుడు శని దేవుడు ఇంటికి వెళ్తారని ఆ నెల రోజుల పాటు అక్కడే ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

Advertisement

సూర్య దేవుడి తేజస్సు ముందు ఆయన కుమారుడు శని తేజస్సు మసకబారుతుంది.అందుకే మకర సంక్రాంతి రోజు సూర్య భగవానుడిని పూజించడం వల్ల శని దోషం నుంచి విముక్తి పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

సూర్య దేవుడు మకర రాశిలోకి ప్రవేశించగానే అంటే శని దేవుడి ఇంటిలోకి ప్రవేశించగానే శనీశ్వరుడు నల్లనువ్వులతో ఆయనకు స్వాగతం పలికారు.ఇలా నల్లనువ్వులతో స్వాగతం పలకడం వల్ల అష్టైశ్వర్యాలు శనీశ్వరునికి సిద్ధించాయని చెబుతారు.

ఈ క్రమంలోనే మకర సంక్రాంతి రోజు ఎవరైతే నల్లనువ్వులతో శనీశ్వరుని, అలాగే సూర్యభగవానుడిని పూజిస్తే వారిపై ఎలాంటి శని ప్రభావం దోషం ఉండదు.ముఖ్యంగా మకరసంక్రాంతి రోజు స్నానం చేసి అనంతరం నీటిలో కొన్ని నువ్వులు వేసి సూర్యుడికి సమర్పించాలి అనంతరం శనీశ్వరుని పూజలో నల్లనువ్వులను సమర్పించాలి.

ఈ విధంగా పూజ చేసిన అనంతరం ఆవనూనె, నల్ల నువ్వులు, నువ్వుల లడ్డూలను పేదలకు దానం చేయడం వల్ల శని ప్రభావం దోషం తొలగిపోతుంది.

ప్రతి రోజు గుప్పెడు అవిసె గింజలను తింటే శరీరంలో కలిగే అద్భుతమైన మార్పులు
Advertisement

తాజా వార్తలు