Sanjay Dutt : డబుల్ ఇస్మార్ట్ కు సంజయ్ దత్ రెమ్యునరేషన్ అన్ని రూ.కోట్లా.. వేరే లెవెల్ అంటూ?

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్( Sanjay dutt ) గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల కాలంలో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు సంజయ్ దత్.

సినిమాలలో ఎక్కువగా నెగటివ్ రూల్స్ చేస్తూ బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.ముఖ్యంగా సంజయ్ కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజిఎఫ్ 2 సినిమాలో ( KGF 2 )తన విశ్వరూపాన్ని చూపించాడని చెప్పవచ్చు.

కేజిఎఫ్ 2 సినిమా తర్వాత ఈయనకు అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయి.ఇది ఇలా ఉంటే సంజయ్ దత్ ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్నారు.

ఇందులో కూడా నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారు.కాగా ఈ సినిమాకు గాను సంజయ్ దత్ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడు అనే విషయం సోషల్ మీడియాలో ( Social media )హాట్ టాపిక్ గా మారింది.తాజాగా అందిన సమాచారం ప్రకారం సంజయ్ దత్ డబుల్ ఇస్మార్ట్ సినిమాకు గాను ఏకంగా ఆరు కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకుంటున్నాడట.

Advertisement

సినిమాలో ఆయన పాత్ర బలంగా ఉంటుందని, చాలా కీలకంగా ఉంటున్న నేపథ్యంలో పారితోషికం బాగానే అందిస్తున్నట్టు టాక్.అయితే ఆయన రేంజ్‌కి అది తక్కువే అయినా, ఒక విలన్‌ పాత్రకి ఆ రేంజ్‌ పారితోషికం ఇవ్వడం ఎక్కువే అని చెప్పవచ్చు.

కాగా ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో( Double ismart movie ) రామ్ పోతినేని హీరోగా నటిస్తుండగా పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.గతంలో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.కాగా ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

ఇకపోతే దర్శకుడు పూరి జగన్నాథ్ ( Puri jagannadh )కు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు.ఎందుకంటే గత సినిమా లైగర్ ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసింది.

కాబట్టి ఈ సినిమాను కాస్త ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారు పూరీ జగన్నాత్.ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 8న పాన్‌ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో రిలీజ్‌ చేయబోతున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇందులో రామ్‌ సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు