ఆ అబ్బాయిల బాక్స్ లో శానిటరీ ప్యాడ్స్.. ఎందుకంటే..?!

తారా అహ్రేన్స్ అనే ఓ అమెరికన్ మహిళ తన ఇద్దరు కుమారులు అయిన మైక్, ఎలిజా లకు.

రుతుస్రావం సమయంలో ఆడవారు ఎంతగా ఇబ్బంది పడతారో పూస గుచ్చినట్టు చెప్పారు.

ఆ తర్వాత ప్రతిరోజు స్కూల్ బ్యాగ్స్ లో శానిటరీ ప్యాడ్స్ తీసుకెళ్లాలని.తమ స్నేహితురాళ్లు పీరియడ్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు సహాయం చేయాలని తారా అహ్రేన్స్ తన ఇద్దరు కుమారులకు చెప్పారు.

ఈ విషయం వారికి చాలా కొత్తగా, వింతగా అనిపించడం తో మొదట్లో శానిటరీ ప్యాడ్స్ తీసుకెళ్లడానికి చాలా ఇబ్బంది పడేవారు.తోటి మగ స్నేహితులు వీళ్ళిద్దరి దగ్గర శానిటరీ ప్యాడ్స్ చూసి నవ్వుకునే వారు.

అయితే ఒకరోజు తమ క్లాస్మేట్ కి పాఠశాలలోనే రుతుస్రావం వచ్చింది.దీంతో ఆ అమ్మాయి రక్తంతో తడిసిన బట్టలతో చాలా ఇబ్బంది పడిపోయింది.

Advertisement
Sanitary Pads In Those Boys Box Mike And Eliza Because, Boys Box, Sanitizer Boxe

ఇదంతా గమనించిన మైక్, ఎలిజా లకు ఆడపిల్లలు ప్రతినెల రుతుస్రావం సమయంలో ఎంతగా ఇబ్బంది పడతారో పూర్తిస్థాయిలో అర్థమయింది.దీంతో తమ తల్లి చెప్పినట్టుగా తమ ఫిమేల్ ఫ్రెండ్ కి సానిటరీ న్యాప్కిన్ తో పాటు టాంప్టన్(తడిని పీల్చుకునే మెత్తటి దూది) ఇచ్చారు.

దీంతో ఆ అమ్మాయి చాలా ఉపశమనంగా ఫీలై వారిద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుంది.మరుసటి రోజు వారంతా తమ ఫిమేల్ క్లాస్మేట్స్ వద్దకు వెళ్లి తమ బ్యాగులో ఎప్పుడూ శానిటరీ ప్యాడ్స్ తో పాటు టాంప్టన్స్ కూడా ఉంటాయని.

అత్యవసరం అయినప్పుడు ఎవరైనా సరే తమని అడగొచ్చని.ఈ విషయం గురించి తమ తల్లి తమకు తెలియజేశారని చెప్పుకొచ్చారు.

Sanitary Pads In Those Boys Box Mike And Eliza Because, Boys Box, Sanitizer Boxe

బహిష్టు అనేది ఓ ప్రకృతి కార్యం కాబట్టి దీని గురించి మాట్లాడేందుకు ఎవరు కూడా సిగ్గు పడనక్కర్లేదని తమ తల్లి చెప్పినట్టు వాళ్ళు తమ స్నేహితురాళ్లతో చెప్పుకొచ్చారు.దీనితో ఆ ఫిమేల్ ఫ్రెండ్స్ మీ అమ్మ గారు చాలా గ్రేట్ అంటూ.తమకు అవసరమైనప్పుడు మీ వద్దే శానిటరీ ప్యాడ్స్ తీసుకుంటామని చెప్పారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!

ఇక ఆరోజు నుంచి తమకు అవసరం వచ్చిన ప్రతిసారి ఫీమేల్ ఫ్రెండ్స్ అంతా కూడా మైక్, ఎలిజా సహాయం తీసుకోవడం ప్రారంభించారు.ఇకపోతే తారా అహ్రేన్స్ ఆడవారి గురించి మగపిల్లలకు అన్ని విడమరచి చెప్పాలని.

Advertisement

సమాజంలో ఆడ మగ అనే తేడా లేకుండా ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని.అలా మెలిగితేనే ఆడవాళ్లపై లైంగిక దాడులు తగ్గుతాయని చెబుతున్నారు.

తాజా వార్తలు