సందీప్ రెడ్డి వంగ - ఎన్టీయార్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్.( Junior NTR ).

ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకోవడంలో ముందు వరుసలో ఉంటుంది.

ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) జూనియర్ ఎన్టీఆర్ లు కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అయితే ఈ ఫోటో మీద కొన్ని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.నిజానికి వీళ్ళ కాంబినేషన్ లో కనక సినిమా వస్తే ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుంది అంటూ పలువురు కొన్ని ఆసక్తికరమైన కామెంట్లను కూడా చేస్తున్నారు.మరి మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుంది అనే దానిమీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.

Advertisement

ఇక మొత్తానికైతే సందీప్ రెడ్డి వంగ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందంటూ ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అలాగే సందీప్ రెడ్డివంగా అభిమానులు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఇక ఆ స్టైల్ లోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా లేదంటే జూనియర్ ఎన్టీఆర్ స్టైల్ లోకి సందీప్ రెడ్డి వంగా వెళ్తాడా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఇప్పుడు కొరటాల శివ( Koratala Shiva ) డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే ఈనెల 27వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇప్పటికే వరుసగా 6 సక్సెస్ లను అందుకొని మంచి జోష్ మీదున్న ఎన్టీయార్ కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

Advertisement

తాజా వార్తలు