కిరోసిన్ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ధృవ వాయు.ఈ సినిమాతో తన టాలెంట్ ని నిరూపించుకున్నారు.
ఇప్పుడు కళింగ అనే మూవీ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమాకు రచయిత, దర్శకుడు, హీరో ఇలా అన్ని తానే.
ఇలా ఈ సినిమాకు అన్ని తానే అయ్యి మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన టాలెంట్ ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ మూవీని బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్( Deepti Kondaveeti, Prithvi Yadav ) నిర్మించారు.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ కాబోతోంది.కానీ ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో సినిమా విడుదలకు ముందే అనగా రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేశారు.
ఈ ప్రీమియర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇకపోతే మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా అసలు కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే.
కథ
కళింగ అనే ఊర్లో అనాథ అయిన లింగ (ధృవ వాయు)సారా కాస్తూ ఉంటాడు.ఆ ఊరి పెద్ద (ఆడుకాలమ్ నరేన్) అతని తమ్ముడు బలి (సంజయ్) తమ గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు.
బలి చాలా చెడ్డవాడు.కనిపించిన ఆడవాళ్ల మీద కన్నేస్తుంటాడు.
లింగ చిన్నతనం నుంచి కూడా పద్దు (ప్రగ్యా నయన్) ప్రేమిస్తుంటాడు.పద్దు కూడా లింగను ప్రేమిస్తూ ఉంటుంది.
కానీ ఇంతలో పద్దు మీద బలి కన్ను పడుతుంది.లింగతో పెళ్లికి ఒక చిక్కు ముడి వేస్తాడు పద్దు తండ్రి (మురళీధర్ గౌడ్).
ఊరి పెద్ద వద్ద తనఖాలో ఉన్న పొలాన్ని విడిపించుకుని వస్తే పెళ్లి చేస్తాను అని చెప్పి లింగకు మాటిస్తాడు.దీంతో లింగకి సంస్థానం లోని స్థలం రాసిస్తాడు.ఆ సంస్థానంలో నేపథ్యం ఏంటి? లింగ పద్దు తండ్రికి స్థలాన్ని రాసిస్తాడా? పద్ధుని పెళ్లి చేసుకుంటాడా? లేదా? చివరికి ఏమైంది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలి అంటే సినిమాను చూడాల్సిందే.
నటీనటుల పనితీరు
నటుడు ధ్రువ వాయు( Dhruva vayu ) తన పాత్రకు తగిన న్యాయం చేశాడని చెప్పాలి.మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా బాగానే నటించాడు.ఇక హీరోయిన్ ప్రగ్యా పద్దు తన పాత్రలో తెరపై అందంగా కనిపించింది.తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అలాగే విలన్లుగా కనిపించిన ఆడుకాలం నరైన్, బలగం సంజయ్ మరీ అంతగా భయపెట్టలేకపోయారని అనిపిస్తుంది.లక్ష్మణ్ మీసాలా ఫ్రెండ్ కారెక్టర్ లో మెప్పిస్తాడు.
బలగం ఆర్టిస్టులు( Balagam artist ) ఇందులో బాగానే మెప్పించారు.మిగిలిన నటీనటులు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.
విశ్లేషణ
కొత్త కథాంశంతో తీసుకువచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.ధృవ వాయు మేకింగ్ అందరినీ మెప్పిస్తుంది.ఇతనిలో ఇంత టాలెంట్ ఉందా? అని కళింగ సినిమా చూస్తే అనిపించక మానదు.టెక్నికల్ గా ఈ చిత్రం చాలా బ్రిల్లియంట్ గా కనిపిస్తుంది.
తెరపై చాలా రిచ్‌గా, అద్భుతంగా అనిపిస్తుంది.సినిమా ఫస్ట్ పది నిమిషాలు అద్భుతంగా అనిపిస్తుంది.
కథలోకి ఆడియెన్స్‌ను అలా లీనం చేసేస్తాడు దర్శకుడు.ఆ తర్వాత ప్రేక్షకులకు ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొంటుంది.
ఇంటర్వెల్ అలాగే సెకండాఫ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.చివరి 20 నిమిషాలు విఎఫ్ఎక్స్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు.
సాంకేతికత
ధ్రువవాయు టెక్నికల్ టీం ( Technical team )ను కూడా బాగానే వాడుకున్నారు.అలాగే మంచి అవుట్ ఫుట్ ని కూడా రాబట్టుకున్నారు.ఈ విషయంలో మాత్రం ధృవ వంద శాతం సక్సెస్ అయ్యాడని చెప్పాలి.లాంటి చిత్రాలకు టెక్నికల్ టీం ప్రధాన బలంగా నిలుస్తుంది.ఆర్ఆర్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది.ఫారెస్ట్ విజువల్స్, భయపెట్టే సీన్లను కెమెరామెన్ ఎంతో సహజంగా, అందంగా తీశాడు.
కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ వర్క్ వల్లే ఈ సినిమా నిలబడుతుందని చెప్పవచ్చు.ఈ సినిమాలో ఆర్ఆర్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి.
రేటింగ్
3.2/5