Samantha south korea : సమంతకు అస్వస్థత.. ట్రీట్మెంట్ కోసం సౌత్ కొరియాకు తరలింపు!

స్టార్ హీరోయిన్ సమంత పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.గత కొంతకాలం నుంచి సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది.

ఇక ఈ విషయాన్ని తానే తన సోషల్ మీడియా వేదికగా తెలుపగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు తనకు ధైర్యం ఇచ్చారు.అయితే ఈమె ప్రస్తుతం అస్వస్థకు గురైనట్లు దాంతో ట్రీట్మెంట్ కోసం సౌత్ కొరియాకు తరలించినట్లు తెలుస్తుంది.

ఇంతకూ అసలేం జరిగిందో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత నటిగా తన పరిచయాన్ని బాగా పెంచుకుంది.

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి మంచి గుర్తింపు సంపాదించుకుంది.అయితే ఈమె గత సంవత్సరం నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది.

Advertisement

కారణం ఏంటో అందరికీ తెలిసిందే.మరో హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాది క్రిందట విడిపోయింది.

దీంతో అప్పటి నుంచి ఆమె ప్రతి ఒక విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.కొన్ని రోజుల వరకు సోషల్ మీడియాలో కూడా కనిపించలేదు.

ఇక తను నాగచైతన్యకు దూరం కావటంతో అందరూ తనపై బాగా విమర్శలు చేశారు.ఇక అవన్నీ తట్టుకొని సమంత వెనుకడుగు వేయకుండా ముందుకు పరుగులు తీసింది.

వరుసగా ప్రాజెక్టులకు సైన్ చేసుకుంటూ పోయింది.ఇటీవలే యశోద సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.

కల్కి సినిమాపై అంచనాలు పెంచేసిన అప్ డేట్.. మాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అంటూ?
రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా లో ఆ కామెడీ సీన్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారా..?

అయితే గత కొన్ని రోజుల నుండి ఆమె మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడటంతో ఆమె పలుచోట్ల చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది.ఈ వ్యాధి కోసం ఆమె గతంలో అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకుంది.

Advertisement

తర్వాత ఇండియాకి వచ్చి చికిత్స చేయించుకుంది.అయితే ఆమెకు ఇంగ్లీష్ మందుల వల్ల ఎటువంటి రిజల్ట్ కనిపించకపోవడంతో ఆయుర్వేద వైద్యం కోసం కేరళకు వెళ్లిందని తెలిసింది.ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మాత్రం మరింత విషమించింది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దీంతో ఆమె పరిస్థితి బాగా దారుణంగా ఉండటంతో వెంటనే తనను దక్షిణ కొరియా దేశానికి తరలించినట్లుగా తెలిసింది.ఇంకా అకస్మాత్తుగా ఈమె పరిస్థితి ఇలా కావడానికి కారణం డిప్రెషన్ అని తెలుస్తుంది.

నాగచైతన్య తో విడిపోయాక ఆమె బాగా డిప్రెషన్ లోకి వెళ్ళింది.వాటి నుండి బయట పడటానికి భారీ భారీ ఎక్సర్సైజులు చేసింది.

ఇటీవల అనారోగ్యం క్షీణించినప్పుడు కూడా భారీ భారీ వర్కౌట్లు చేస్తూ కనిపించింది.దీంతో తన కండరాలపై ఒత్తిడి పడటంతో తన పరిస్థితి విషమించిందని తెలుస్తుంది.

ఇక ఈ ట్రీట్మెంట్ కోసం ఆమె దక్షిణ కొరియాకు వెళుతున్నట్లుగా అక్కడ ఈ వ్యాధికి సంబంధించిన వైద్యం అందుబాటులో ఉందని తెలిసింది.దీంతో అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు.త్వరగా కోలుకోవాలి అని కోరుకుంటున్నారు.

ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో మాత్రం ఈ వార్త బాగా వైరల్ అవుతుంది.

" autoplay>

తాజా వార్తలు