ఖుషి ప్రమోషన్స్ కి సమంత కండీషన్స్..?

విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) సమంత లీడ్ రోల్స్ లో శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఖుషి( Khushi movie ).

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషం అబ్ధుల్ వాహబ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సినిమా నుంచి ఇప్పటికే 3 సాంగ్స్ రిలీజ్ కాగా అవి ఆడియన్స్ ని మెప్పించాయి.ఇక ఈరోజు ఖుషి ట్రైలర్ రిలీజ్ ఫిక్స్ చేశారు.

సినిమాను సెప్టెంబర్ 1న రిలీజ్ ప్లాన్ చేయగా ఆగష్టు సెకండ్ వీక్ నుంచి సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు.అయితే సమంత ఖుషి ప్రమోషన్స్ పాల్గొనాలంటే కొన్ని కండీషన్స్ పెట్టిందట.

ఓన్లీ సినిమా ఇంటర్వ్యూస్ వరకు ఓకే కానీ పబ్లిక్ ప్రమోషన్స్ కి మాత్రం తాను రాలేనని చెప్పిందట.

Samantha Conditions For Vijay Devarakonda Khushi Promotions, Vijay Devarakonda,
Advertisement
Samantha Conditions For Vijay Devarakonda Khushi Promotions, Vijay Devarakonda,

ఇంటర్వ్యూస్ అయితే ఎన్నైనా ఇస్తాను కానీ పబ్లిక్ ప్రమోషన్స్ కి మాత్రం తాను ఆసక్తిగా లేదని చెప్పిందట.విజయ్ దేవరకొండ సమంత( Samantha ) ఈ ఇద్దరి జోడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని తెలుస్తుంది.విజయ్ దేవరకొండ, సమంత ఇద్దరు కూడా ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఉంది.

లైగర్ తో డిజాస్టర్ అందుకున్న విజయ్ ఖుషి కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే.సమంత కూడా శాకుంతలం ఫ్లాప్ తో డీలా పడగా ఖుషితో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది.

Advertisement

తాజా వార్తలు