వైరల్: బోర్న్ బేబీ నుండి 20 ఏళ్ల వరకు ఫొటోలు.. కూతురుని చూసి మురిసిపోతున్న తండ్రి!

కూతురు – తండ్రి బంధం గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు.జుబ్బాలు వేసుకునే నాటినుండే తండ్రి తన కన్న కూతురిని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు.

 Viral: Photos From Born Baby To 20 Years Old.. Father Who Is Crying After Seeing-TeluguStop.com

వారిద్దరి అన్యోన్యతను చూసిన కన్నతల్లి ఒకింత అసూయ పడుతూ ఉంటుంది.అంతలాగ వారి అనుబంధం పెనువేసుకు ఉంటుంది.

ఇక ఎదుగుతూ వున్న తన బిడ్డని తండ్రి అప్పుడే ఎంత పెద్దది అయిపోయిందో అని తండ్రి మురిసిపోతూ ఉంటాడు.మొన్నటికి మొన్న నా గుండెలమీద తన్నుతు ఆడుకున్న చిట్టితల్లి అప్పుడే ఎంత ఎదిగిపోయిందో అని లోలోపల సంతోషపడిపోతాడు.

తండ్రి పిచ్చిప్రేమ అటువంటిది మరి.

ఇదే క్రమంలో చాలా తండ్రులు ఎప్పటికప్పుడు తమ బిడ్డల ఫోటోలను క్లిక్ చేస్తూ భద్రపరుచుకుంటూ వుంటారు.దానికి ఓ తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తాజా వీడియోనే నిదర్శనమని చెప్పుకోవాలి.విషయం ఏమిటంటే, తన కూతురు పుట్టినప్పటినుంచి 20 ఏళ్లు వచ్చే వరకు క్రమం తప్పకుండా ప్రతీ వారం ఫోటో తీయటం, దాని దాచిపెట్టటం చేసేవాడు.

ఇక బిడ్డకు 20 ఏళ్లు వచ్చాక ఆ ఫోటోలన్నీ ఓ వీడియో చేసాడు.తాజాగా ఈ ఫోటోలను సోషల్ మీడియా( Social media )లో పోస్ట్ చేస్తూ… “నా బిడ్డ ఎంతగా ఎదిగిపోయిందో!” అని క్యాప్షన్ ఇచ్చి మురిసిపోయాడు.

దాంతో అలా 20ఏళ్లపాటు ప్రతీ వారం తీసిన ఫోటోలను వీడియో చేసి సోషల్ మీడియోలో పోస్ట్ చేయటంతో అది వైరల్ అవుతోంది.

కేవలం 2 నిమిషాల, 18 సెకన్ల నిడివి గల వీడియోలో, శిశువు యువతిగా ఎదుగుతున్నట్లు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.అవును, ఈ వీడియో అతని ప్రేమకు అద్దం పడుతోంది.అతను మరెవరో కాదు… అతనే డచ్‌ డైరెక్టర్‌ ఫ్రాన్స్‌ హాఫ్‌మెస్టర్( Hofmeister ).ఆయన ఒక టైమ్‌లాప్స్‌ వీడియో రూపొందించారు.ఈ వీడియో కోసం ఆయన 20 ఏళ్ల పాటు ప్రతీవారం తమ కుమార్తెకు ఫొటోతీస్తూ వచ్చానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.ఆ ఫొటోలన్నింటినీ ఇప్పుడు టైమ్‌లాప్స్‌ వీడియోగా రూపొందించారు.2 నిముషాల 18 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో అతని కుమార్తె చిన్నప్పటి నుంచి ఎలా రూపాంతరం చెందుతూ వచ్చి.అందమైన అమ్మాయిగా ఎలా మారిందో కనిపిస్తుంది.అలా తన కూతురు 20 పుట్టిన రోజుకు ఆ వీడియోను కానుకగా ఇచ్చాడు మన డైరెక్టర్‌ ఫ్రాన్స్‌ హాఫ్‌మెస్టర్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube