సమంత ఇలా కూడా సంపాదించేస్తోంది.. వీడియో వైరల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ సమంత.తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

తన అందంతో ఎంతోమంది కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది.అతి తక్కువ సమయంలో స్టార్ హోదా ను సంపాదించుకుంది.

ఎంత బిజీ లైఫ్ లో ఉన్న కూడా సోషల్ మీడియాలో సమయాన్ని గడుపుతుంది.సమంత.

ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Advertisement

అంతేకాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.

ఇక తనతో కలిసి నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత సమంత అవకాశాలతో గాల్లోకి ఎగిరిందని చెప్పవచ్చు.ఎందుకంటే పెళ్లి తర్వాత సమంత సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

పెళ్లి తర్వాత నాగచైతన్య తో కలిసి సినిమాలలో నటించింది.బుల్లితెర ప్రకటనల్లో కూడా నటించింది.

పలు వ్యాపారాలు కూడా ప్రారంభించింది.మొత్తానికి పెళ్లి తర్వాత సమంత కు బాగా కలిసి వచ్చింది.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

కానీ గత ఏడాది నాగచైతన్యను విడిపోయి టాలీవుడ్ ప్రేక్షకులందరికీ షాక్ ఇచ్చింది. విడాకుల అనంతరం సమంత బాగా యాక్టివ్ గా మారింది.

Advertisement

ఒంటరిగా ఉంటూ మరింత ధైర్యాన్ని పెంచుతుంది.పైగా అవకాశాలు కూడా బాగానే అందుకుంటుంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన వర్కవుట్లు వీడియోలను, ట్రెండీ ఫోటోలను బాగా పంచుకుంటుంది.

క్లీవేజ్ షో లతో నెటిజన్లను బాగా రచ్చరచ్చ చేస్తుంది.పొట్టి పట్టి బట్టలతో గ్లామర్ లుక్ లతో అందర్నీ తన వైపు మలుపుకుంటుంది.సంపాదన పరంగా సమంత బాగా సంపాదిస్తుందని చెప్పవచ్చు.

కేవలం సినిమాల పరంగా కాకుండా యాడ్స్ పరంగా కూడా బాగా సంపాదిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా మరో యాడ్ పరంగా కూడా బాగా సంపాదిస్తుంది.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసుకోగా.అందులో తాను యాడ్ లో భాగంగా.ఒక గ్రౌండ్ లో కూర్చొని ఆపిల్ జ్యూస్ తాగుతూ కనిపించింది.

ఇక అదంతా ఆ ఆపిల్ జ్యూస్ కోసం తాను అడ్వర్టైజ్ ఇచ్చింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజనులు లైకుల తో పాటు కామెంట్లు కూడా పెడుతున్నారు.సమంత ఇలా కూడా సంపాదించేస్తుంది కదా అని అంటున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే సమంత బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుందని తెలుస్తుంది.టాలీవుడ్ లో శాకుంతలం సినిమా పూర్తి చేయగా.

ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.మిగతా ప్రాజెక్టులలో కూడా అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు