'సలార్' నుండి అఫిషియల్ అనౌన్స్.. విజువల్ ట్రీట్ కు గెట్ రెడీ!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టు సలార్.

ఆదిపురుష్( Adipurush ) వంటి ప్లాప్ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న సినిమా ఇదే కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.

బాహుబలి తర్వాత మళ్ళీ ప్రభాస్ బ్లాక్ బస్టర్ అందుకోనేలేదు.

దీంతో ఇదైనా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నారు.మరి ఈ సినిమా మరో నెల రోజుల్లో రిలీజ్ కాబోతుంది.దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.

ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ నుండి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయ్యి అంచనాలు అమాంతం పెంచేయగా ఇప్పుడు అంతా కూడా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు.పాన్ ఇండియా సినిమా దగ్గర బిగ్గెస్ట్ ట్రీట్ ఇచ్చే సినిమాగా ముఖ్యంగా మూవీ లవర్స్ కు ఐమాక్స్ వర్షన్ రిలీజ్ పై మేకర్స్ ఈ రోజు అఫిషియల్ అప్డేట్ ఇచ్చారు.

Advertisement

యూఎస్ డిస్టిబ్యూటర్స్ సలార్ సినిమా ఐమాక్స్ వర్షన్ రిలీజ్ ను కన్ఫర్మ్ చేసారు.వరల్డ్ వైడ్ గా కూడా ఈ సినిమా ఐమాక్స్ స్క్రీన్ లలో అదిరిపోయే ట్రీట్ ఇస్తుందని తెలియడంతో ఈ ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

చూడాలి మరి సలార్ ( Salaar movie )అయినా డార్లింగ్ ఫ్యాన్స్ దాహాన్ని తీరుస్తుందో లేదో.కాగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.చూడాలి ఈ సినిమా అయిన ప్రభాస్ కెరీర్ లో బాహుబలి రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో.

వైరల్ వీడియో : కారుతో ఢీకొట్టి పరారైన బీజేపీ అధ్యక్షుడి కుమారుడు..
Advertisement

తాజా వార్తలు