వైసీపీ కీలక నేత ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు.జగన్ తో భేటీ కాక ముందు ఉద్యోగ సంఘాల నాయకులతో సజ్జల భేటీ కావడం జరిగింది.
అనంతరం క్యాంప్ ఆఫీస్ లో సీఎంతో సజ్జల రామకృష్ణా రెడ్డి చర్చలు జరుపుతున్నారు.ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే రేపు ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి జగన్ భేటీ కానున్నారు.ఇదిలా ఉంటే ఫిట్మెంట్ విషయంలో సీఎం జగన్ నుండి సానుకూల నిర్ణయం వస్తుందని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాల అధినేత వెంకట్రామిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఫిట్మెంట్ 34 శాతం తగ్గకుండా ఇవ్వాలని కోరినట్లు.వెంకట్రామిరెడ్డి తెలిపారు.
అయితే కరోనా కారణంగా ఆదాయం తగ్గటంతో పాటు బయటి నుండి వచ్చే ఆదాయం విషయంలో కొంతమంది అడ్డుకునే రీతిలో వ్యవహరిస్తూ ఉండటం.వంటి ఇబ్బందులు ప్రభుత్వ పెద్దలు తెలిపినట్లు వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు.
ఏదిఏమైనా తమ అభిప్రాయాలు ప్రభుత్వానికి తెలియజేసినట్లు, ప్రభుత్వ ఇబ్బందులు కూడా విన్నట్లు వెంకట్రాంరెడ్డి చెప్పుకొచ్చారు.ఈ తరుణంలో రేపు నేరుగా సీఎం జగన్ తో భేటీ కానున్న నేపథ్యంలో పీఆర్సీ విషయంలో… క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.