వచ్చే సార్వత్రిక ఎన్నికలో మోడీని( Modi ) గద్దె దించాలని విపక్షాలు బలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి.
కాగా బీజేపీకి జాతీయ రాజకీయాల్లో బలమైన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఉంది.మోడీని ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ తరుపున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ( Rahul Gandi ) రేస్ లో ఉన్నారు.
అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్రంలో మోడీని గద్దె దించడం ఒక్క కాంగ్రెస్ వల్ల అయ్యే పని కాదని స్వయంగా హస్తం నేతలే చెబుతున్నారు.అందుకే విపక్షాలు ఏకం కావాలని కాంగ్రెస్ అధిష్టానమే పిలుపునిస్తోంది.
అయితే అయితే విపక్షాల నుంచి ప్రధాని రేస్ లో ఉన్న నేతలు కూడా చాలమందే ఉన్నారు.తృణమూల్ కాంగ్రెస్( Trunamul congress ) తరుపున మమతా బెనర్జీ( Mamatha benarji ), జేడీయూ నుంచి నితీశ్ కుమార్, ఎన్సీపీ నుంచి శరత్ పవార్, బిఆర్‌ఎస్ నుంచి కేసిఆర్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఇలా రాజకీయ ఉద్దండులందరూ ప్రధాని పదవిపై గట్టిగానే కన్నెశారు.
వీరంతా కాంగ్రెస్ కు మద్దతు తెలిపితే ప్రధాని అభ్యర్థి రేస్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.ఎందుకంటే కాంగ్రెస్ నేతృత్వంలో రాహుల్ గాంధీ రేస్ లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి.
అందుకే విపక్షాల నుంచి కాంగ్రెస్ కు సరైన మద్దతు లభించడం లేదనే చెప్పవచ్చు.అలా కాకుండా కాంగ్రెస్ ను కాదని థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడే ప్రయత్నం చేసిన.
అక్కడ కూడా ప్రధాని అభ్యర్థి ఎవరనే క్వశ్చనే ప్రధానంగా వినిపిస్తుంది.

విపక్షాలను ఏకం చేసేందుకు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికి అందరికీ ప్రధాని పదవే మెయింట్ టార్గెట్ అని చెప్పక తప్పదు.అయితే ప్రధాని అభ్యర్థి విషయంలో విపక్షాలు ఏకాభిప్రాయంతో ముందుకు కదిలినప్పుడే మోడీని ఢీ కొట్టగలవని విశ్లేషకులు చెబుతున్నారు.ఇదిలా ఉంచితే తాను ప్రధాని పదవి అభ్యర్థి రేస్ లో లేనని ఎన్సీపీ అధినేత శరత్ పవార్( Sharath power ) ఇటీవల స్పష్టం చేశారు.
విపక్షలను ఏకం చేసేందుకు తాను కృషి చేస్తానని చెబుతూనే, వచ్చే ఎన్నికల్లో తను పోటీ చేయడం లేదని అందువల్ల తాను ప్రధాని పదవి రేస్ లో లేనని వ్యాఖ్యానించారు శరత్ పవార్.దాంతో విపక్షాల నుంచి ప్రస్తుతం నితీశ్ కుమార్, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కేసిఆర్ వంటి వాళ్ళు ప్రధాని రేస్ లో ఉన్నారు.
మరి ఈ విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకుంటాయో చూడాలి.







