ఏ యాంగిల్ లో చూసిన మదర్ లా కాదు అలా కనిపిస్తున్నారు.. కస్తూరిపై ఓంకార్ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర యాంకర్లలో చాలామంది యాంకర్లు ఉన్నా ఓంకార్( Anchor Omkar ) యాంకరింగ్ శైలి ఇతర యాంకర్లకు భిన్నంగా ఉంటుంది.ప్రస్తుతం ఓంకార్ సిక్స్త్ సెన్స్ సీజన్5 కు( Sixth Sense Season 5 ) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

 Omkar Shocking Comments About Kasturi Details, Omkar, Kasturi, Sixth Sense Seaso-TeluguStop.com

ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లను సస్పెన్స్ తో టెన్షన్ పెడుతూ ఓంకార్ తన హోస్టింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.తాజాగా రిలీజైన సిక్స్త్ సెన్స్ ప్రోమోకు కస్తూరితో( Kasthuri Shankar ) పాటు నీపా హాజరు కావడం జరిగింది.

వీళ్లిద్దరితో పాటు జ్యోతిరెడ్డి, సుష్మకిరణ్ ఈ షోలో సందడి చేయడం గమనార్హం.ఈ షో ప్రోమోలో ఓంకార్ మాట్లాడుతూ ” మీ నలుగురు.మదర్స్ ఉన్నారు కానీ మీరు ఇంత హాట్ గా వస్తే నాకు చెమట్లు పడుతున్నాయి” అని అన్నారు.కస్తూరి, నీపా ఊ అంటావా మావ సాంగ్ కు అద్భుతంగా డ్యాన్స్ చేసి తమ డ్యాన్స్ తో మెప్పించడం గమనార్హం.

ప్రోమోలో “బావవి నువ్వు భామను నేను” సాంగ్ కు కస్తూరి తన డ్యాన్స్ తో అదరగొట్టారు.

కస్తూరి డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసిన ఓంకార్ కస్తూరి గారు కింద ఏదో పడిపోయింది అని చెప్పగా ఏమిటి సార్ అని అడుగుతూ కస్తూరి నేలపై వేతికారు.ఆ సమయంలో ఓంకార్ మీ అందం పడిపోయింది అని చెప్పుకొచ్చారు.ఆ తర్వాత ఓంకార్ ఏనుగును కనుక బహుమతిగా ఇస్తే ఎక్కడ దాచుకుంటారు అని అడగగా మీ పెద్ద మనసులో దాచి పెట్టుకుంటాం సార్ అని కామెంట్లు చేశారు.

ఓంకార్ మాట్లాడుతూ ఏ యాంగిల్ లో చూసినా మీరు మదర్ లా కనిపించడం లేదని మరదలులా కనిపిస్తున్నారని అన్నారు.ఈ ప్రోమోకు 3.2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.వయస్సు పెరుగుతున్నా కస్తూరి శంకర్ తన అందంతో ఆకట్టుకుంటూ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube