ఏ యాంగిల్ లో చూసిన మదర్ లా కాదు అలా కనిపిస్తున్నారు.. కస్తూరిపై ఓంకార్ షాకింగ్ కామెంట్స్!
TeluguStop.com
బుల్లితెర యాంకర్లలో చాలామంది యాంకర్లు ఉన్నా ఓంకార్( Anchor Omkar ) యాంకరింగ్ శైలి ఇతర యాంకర్లకు భిన్నంగా ఉంటుంది.
ప్రస్తుతం ఓంకార్ సిక్స్త్ సెన్స్ సీజన్5 కు( Sixth Sense Season 5 ) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లను సస్పెన్స్ తో టెన్షన్ పెడుతూ ఓంకార్ తన హోస్టింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.
తాజాగా రిలీజైన సిక్స్త్ సెన్స్ ప్రోమోకు కస్తూరితో( Kasthuri Shankar ) పాటు నీపా హాజరు కావడం జరిగింది.
వీళ్లిద్దరితో పాటు జ్యోతిరెడ్డి, సుష్మకిరణ్ ఈ షోలో సందడి చేయడం గమనార్హం.ఈ షో ప్రోమోలో ఓంకార్ మాట్లాడుతూ " మీ నలుగురు.
మదర్స్ ఉన్నారు కానీ మీరు ఇంత హాట్ గా వస్తే నాకు చెమట్లు పడుతున్నాయి" అని అన్నారు.
కస్తూరి, నీపా ఊ అంటావా మావ సాంగ్ కు అద్భుతంగా డ్యాన్స్ చేసి తమ డ్యాన్స్ తో మెప్పించడం గమనార్హం.
ప్రోమోలో "బావవి నువ్వు భామను నేను" సాంగ్ కు కస్తూరి తన డ్యాన్స్ తో అదరగొట్టారు.
"""/" /
కస్తూరి డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసిన ఓంకార్ కస్తూరి గారు కింద ఏదో పడిపోయింది అని చెప్పగా ఏమిటి సార్ అని అడుగుతూ కస్తూరి నేలపై వేతికారు.
ఆ సమయంలో ఓంకార్ మీ అందం పడిపోయింది అని చెప్పుకొచ్చారు.ఆ తర్వాత ఓంకార్ ఏనుగును కనుక బహుమతిగా ఇస్తే ఎక్కడ దాచుకుంటారు అని అడగగా మీ పెద్ద మనసులో దాచి పెట్టుకుంటాం సార్ అని కామెంట్లు చేశారు.
"""/" /
ఓంకార్ మాట్లాడుతూ ఏ యాంగిల్ లో చూసినా మీరు మదర్ లా కనిపించడం లేదని మరదలులా కనిపిస్తున్నారని అన్నారు.
ఈ ప్రోమోకు 3.2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
వయస్సు పెరుగుతున్నా కస్తూరి శంకర్ తన అందంతో ఆకట్టుకుంటూ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.
కొత్త వైట్ సాక్స్ ధరించి జపాన్ వీధుల్లో నడిచిన యువతి.. కట్ చేస్తే..?