తండ్రి బాటలోనే సైఫ్ తనయుడు....

ఒకపక్క బాలీవుడ్ లో నెపోటిజం పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా నట వారసత్వం మాత్రం కొనసాగుతూనే ఉంది.

వరుసగా నట వారసులు తెరమీదకు అరంగేట్రం చేస్తూనే ఉన్నారు.

ఇప్పుడు తాజాగా బాలీవుడ్‌లో మరో నట వారసుడు అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తుంది. సైఫ్‌ అలీఖాన్‌ తనయుడు ఇబ్రహీం అలీఖాన్‌ కూడా తండ్రి బాటలోనే అడుగులు వేయనున్నట్లు తెలుస్తుంది.

Saif's Son Makes His Film Debut, Saif Ali Khan, Ibrahim Ali Khan, Bollywood Deb

ఈ విషయాన్ని సైఫ్‌ స్వయంగా ప్రకటించారు.తనయుడి సినీ ప్రవేశం గురించి సైఫ్ స్వయంగా మాట్లాడారు.

ఇబ్రహీం చదువు పూర్తయ్యాక సినిమాల్లోకి అడుగుపెడతాడు.సినిమాల్లో నటించాలనుకుంటే ఇప్పటినుంచే సిద్ధమవ్వాలని అతనికి చెప్పినట్లు సైఫ్ తెలిపారు.18 ఏళ్ల వయసులో నా జీవితం అంతా గందరగోళంగా ఉంది.ఆసమయంలో నటనే నా కెరీర్ ను పాడుకాకుండా చేసింది.

Advertisement

అందుకే నా పిల్లలందరినీ సినీ పరిశ్రమలోకి తీసుకొస్తాను.పనిచేసేందుకు సినీరంగం మంచి ప్లేస్‌ అంటూ సైఫ్ వ్యాఖ్యానించారు.

ఇటీవల ఇబ్రహీం ఒక మేగజైన్‌ కవర్‌పైన కనిపించడమే కాకుండా సోదరి సారాతో కలసి దుస్తుల బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం జరిపిన ఫొటో షూట్‌లో కూడా పాల్గొన్నాడు.సైఫ్ కూతురు సారా అలీఖాన్‌ ఇప్పటికే పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించి మంచి కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా సైఫ్ కుమారుడు కూడా తండ్రి బాటనే ఎంచుకోవడం విశేషం.సైఫ్,అమృతా సింగ్ ల సంతానమే ఈ సారా,ఇబ్రహీం.

వారిద్దరూ కూడా సైఫ్ మొదటి భార్య అమృతా సింగ్ సంతానం కాగా, ఆమెకు విడాకులు ఇచ్చిన తరువాత బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు