ఎన్టీఆర్, అల్లు అర్జున్ లో అదంటే చాలా ఇష్టం: గని హీరోయిన్

టాలీవుడ్ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ కలిసి నటించిన తాజా చిత్రం గని.

ఈ సినిమాను అల్లు బాబి సిద్దు ముద్ద కలిసి నిర్మించారు.

ఏప్రిల్ 8న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబంధం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఈ సందర్భంగా గని హీరోయిన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.గని సినిమాలో నాది బబ్లీ గర్ల్ క్యారెక్టర్.

ఈ క్యారెక్టర్ ఎంతో సరదాగా ఉంటుంది.నేను నటించిన తొలి తెలుగు సినిమా విడుదల అవుతుండటంతో చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అని తెలిపింది సయీ మంజ్రేకర్.

Advertisement

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ప్రేక్షకుల మధ్య కూర్చొని ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని వేచి చూస్తున్నాను అని తెలిపింది సయీ మంజ్రేకర్.ఈమె తండ్రి దర్శకుడు, నటుడు నిర్మాత అయిన మహేష్ మంజ్రేకర్ గురించి మనందరికీ తెలిసిందే.

తెలుగు సినీ పరిశ్రమలో మహేష్ మంజ్రేకర్ కు మంచి గుర్తింపు ఉంది.అయితే మహేష్ మంజ్రేకర్ వారసురాలిగా నేను ఇండస్ట్రీ లోకి రావడం ఒత్తిడిగా భావించ లేదు కానీ ఒక బాధ్యతగా ఫీల్ అయ్యాను అని చెప్పుకొచ్చింది సయీ మంజ్రేకర్.

నాన్న సలహాలు నాకు కెరీర్ పరంగా ఎంతో ఉపయోగపడ్డాయి, మా నాన్న పేరు చెడగొట్ట కూడదు చెడిపోకూడదని అని ఆలోచిస్తూ ఉంటాను అని తెలిపింది.

అంతేకాకుండా నేను నటించే సినిమాల కథలను మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి వింటాను.ఈ కథ విన్న తర్వాత సినిమా చేయాలా వద్దా అన్నది చివరి నిర్ణయం నాదే అని తెలిపింది సయీ మంజ్రేకర్.అలాగే తనకు తెలుగు సినీ పరిశ్రమ అంటే చాలా గౌరవం అని తెలుగులో విడుదలయ్యే సినిమాలన్నీ హిందీ డబ్బింగ్ లో చూస్తాం అని తెలిపింది.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

అలా మగధీర,పుష్ప సినిమాలకు తాను ఫిదా అయ్యాను అని చెప్పుకొచ్చింది సయీ మంజ్రేకర్.అలాగే తనకు టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని, జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ డాన్స్ అంటే ఇంకా ఇష్టం అని తెలిపింది.

Advertisement

గని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ని దగ్గరగా చూసినప్పుడు లోలోపల ఎగిరి గంతులేశాను అని చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు