శ్యామ్ సింగరాయ్ లో అలాంటి పాత్రలో కనిపించనున్న సాయి పల్లవి

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్యామ్ సింగరాయ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీ కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.నాని కెరియర్ హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా శ్యామ్ సింగరాయ్ ఉంది.

ఇదిలా ఉంటే ఈ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యి కొంత భాగం కంప్లీట్ అయ్యింది.లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడిన మళ్ళీ రీసెంట్ గా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ సాయి పల్లవి చేసే పాత్ర గురించి ఇప్పుడు ఓ హాట్ న్యూస్ వైరల్ అవుతుంది.ఈ మూవీలో సాయి పల్లవి పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది టాక్.

Advertisement

ఇంకా చెప్పాలంటే కంప్లీట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సాయి పల్లవి ఈ మూవీలో కనిపించబోతుంది తెలుస్తుంది.ఇక కంప్లీట్ గా భిన్నమైన గెటప్ లో డిఫరెంట్ మేనరిజమ్స్ ఆమె పాత్ర ప్రెజెంటేషన్ ఉంటుందని బోగట్టా.

ఇక దర్శకుడు రాహుల్ ఎంతో రీసెర్చ్ చేసి సాయి పల్లవి పాత్రని డిజైన్ చేసినట్లు బోగట్టా.ఇక ఈ పాత్ర గురించి చెప్పిన తర్వాత ఆమె కూడా చాలా ఎగ్జయిట్ అయ్యి నటించడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.

కంప్లీట్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడంతో తనలోని భిన్నమైన నటనని తెరపై ప్రేక్షకులకి చూపించే అవకాశం వస్తుందని సాయి పల్లవి భావించి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి పల్లవి నటించిన లవ్ స్టొరీ, విరాటపర్వం సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి.

థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడంతో త్వరలో ఈ సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించడానికి చిత్ర నిర్మాతలు రెడీ అవుతున్నారు.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు