Sai pallavi : సాయి పల్లవి ఫేవరెట్ సినిమాలేంటో తెలుసా.. ఫేవరెట్ విలన్ ఎవరు తెలిస్తే…?

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి.ఈ పాప పక్కా తమిళనాడు.

అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంటుంది.అందుకే టాలీవుడ్ ఆడియన్స్ ఆమెకు బాగా దగ్గరయ్యారు.

అంతేకాదు సాయి పల్లవి డాన్స్ బాగా చేస్తుంది.మంచి నటి కూడా.

ఆమె డబ్బు కోసం తన క్యారెక్టర్ ను వదులుకోదు.అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని అతి తక్కువ కాలంలోనే సంపాదించింది.

Advertisement

ఈ అందాల తార చేసే ప్రతి సినిమా కూడా ఒక యూనిక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.అందుకే ఆమె మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడతారు.

ఈ ముద్దుగుమ్మ చాలా వినయంగా కూడా ఉంటుంది.చిన్నపాటి ఇంటర్వ్యూలకు కూడా వెళ్లి వారి ప్రశ్నలకు ఆన్సర్లు చేస్తుంది.

తాజాగా ఈ తార ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకి ఇష్టమైన విషయాలన్నిటినీ వెల్లడించింది.తన ఫేవరెట్ హీరో సూర్య అని, ఫేవరెట్ హీరోయిన్ జ్యోతిక అని, ఫేవరెట్ ఫుడ్ బసవ రైస్ అని సాయి పల్లవి టకాటక చెప్పేసింది.మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి అని అడగగా చెన్నైలోని తిరువాన్మియూర్ బీచ్ అని టక్కున చెప్పింది.

ఆ బీచ్ కి మార్నింగ్ నాలుగు గంటలకు వెళ్తే తనకు చాలా బాగా నచ్చుతుందని చెప్పింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఫేవరెట్ సినిమా ఏంటి అని అడగగా.మౌనరాగం, కన్నతిల్ ముత్తమిట్టల్, ఎల్విస్‌ అని సాయి పల్లవి చకచకా చెప్పేసింది.నువ్వు చేసిన రోల్స్ లో ఏవి అంటే ఇష్టం అని అడగ్గా ప్రేమమ్, ఫిదా, శ్యామ్ సింగరాయ్‌ గార్గి అని చెప్పింది.

Advertisement

ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం అని, ఫేవరెట్ విలన్ ప్రకాష్ రాజ్ అని పేర్కొంది.అయితే సాయి పల్లవికి నచ్చిన ఆ సినిమాలను చూడని వారు ఇప్పుడు చూస్తామని అంటున్నారు.

సాయి పల్లవికి మంచి ఫుడ్ టేస్ట్ ఉందని మరికొందరు పొగుడుతున్నారు.ఇకపోతే ఈ ముద్దుగుమ్మ త్వరలో నాగచైతన్యతో కలిసి NC13 సినిమాలో కనిపించనుంది.

ప్రస్తుతం ఆమె ఒక హిట్టు కొట్టాల్సిన అవసరం వచ్చింది.విరాట్ పర్వం, గార్గి రెండు సినిమాలు కూడా పెద్దగా అలరించలేకపోయాయి కాబట్టి ఇప్పుడు ఒక మంచి సినిమాతో రావాలి, ప్రేక్షకులను అలరించాలి.

తాజా వార్తలు