ఫిలింఫేర్ అవార్డులలో సత్తా చాటిన సాయి పల్లవి... స్టార్ హీరోయిన్లను వెనక్కి నెట్టి మరీ?

ప్రేమమ్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి సాయి పల్లవి( Sai Pallavi ) .

ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె అనంతరం తెలుగులో ఫిదా సినిమా( Fidha Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక తెలుగులో కూడా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఫిదా చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక సాయి పల్లవి సినిమా అంటే సినిమాలు కంటెంట్ ఉండడమే కాకుండా ఈమె ఎంతో సహజ సిద్ధంగా ఎలాంటి గ్లామర్ షో కి తావు లేకుండా చక్కగా ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తారు.

ఈ విధంగా సాయి పల్లవి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక సాయి పల్లవి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 9 సంవత్సరాలు అయింది అయితే ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో వివిధ భాషలలో 19 సినిమాలలో నటించారు.ఇటీవల ఇండస్ట్రీకి కాస్త విరామం తీసుకున్న సాయి పల్లవి తిరిగి బాలీవుడ్ సినిమాల నుంచి మొదలుకొని సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా( Virata Parvam )కి గాను ఉత్తమ నటిగా 2023 సౌత్ ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

Advertisement

అయితే ఇప్పటివరకు కాజోల్ సమంత వంటి స్టార్ హీరోయిన్లు ఐదు ఫిలింఫేర్ అవార్డులను అందుకు ఒక సాయి పల్లవి మాత్రం ఏకంగా వారిని వెనక్కి నెట్టి మరి ఆరు ఫిలింఫేర్ ( Film Fare )అవార్డులను అందుకొని సరికొత్త రికార్డు సృష్టించారు అయితే ఈమె పేరు అవార్డు అందుకున్నటువంటి సినిమాలలో నాలుగు తెలుగు సినిమాలు ఉండటం విశేషం.ఫిదా, శ్యాం సింగరాయ్, లవ్ స్టోరీ, విరాటపర్వం వంటి తెలుగు సినిమాలకు ఈమె ఫిలింఫేర్ అవార్డు అందుకోగా మరో రెండు గార్గి, ప్రేమమ్ సినిమాలకు అవార్డును అందుకున్నారు..

డంప్‌స్టర్ డైవింగ్ ద్వారా రూ.63 లక్షలు సంపాదించిన యూఎస్ మహిళ..?
Advertisement

తాజా వార్తలు