ఆ ప్రేమ కోసం నేను ఇక్కడికి వచ్చాను.. సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సాయి ధరమ్ తేజ్ ఇటీవల విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులకు పలకరించిన విషయం తెలిసిందే.

ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు సాయి తేజ్.ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాలో నటిస్తుండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తికాగా త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా హీరో సాయి ధరమ్ తేజ్ సుందరం మాస్టర్‌( Sundaram Master ) సినిమా టీజర్‌ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

టీజర్‌ని విడుదల చేసిన అనంతరం సాయి తేజ్ మాట్లాడుతూ.నేను ఇక్కడికి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.హర్ష కుటుంబ సభ్యుల్లో ఆనందం చూసేందుకు, నా అభిమాన నటుడు రవితేజ( Actor Raviteja ) కోసం, మీ ప్రేమను పొందడానికి వచ్చాను అని తెలిపారు.

Advertisement

ఈ మాటతో ఆడిటోరియం అభిమానుల కేరింతలతో మార్మోగింది.దాంతో, అమ్మాయి ప్రేమలో కిక్‌ లేదని, మీ ప్రేమలోనే కిక్‌ ఉందని సాయిధరమ్‌ తేజ్‌ పేర్కొన్నారు.తనను ఆదరిస్తున్నట్లే సుందరం మాస్టర్‌ టీమ్‌ కి కూడా బ్లెస్సింగ్స్‌ ఇవ్వాలని కోరారు సాయి తేజ్.

ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే సుందరం మాస్టర్ సినిమా విషయానికి వస్తే.వైవా హర్ష( Viva Harsha ) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో దివ్య శ్రీపాద హీరోయిన్గా నటించింది.

కళ్యాణ్ సంతోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.సుధీర్ కుమార్‌ కుర్రాతో కలిసి ప్రముఖ హీరో రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు