16 ఏళ్లకే అలాంటి సమస్య.. నాలుగు నెలల్లోనే ఐఏఎస్.. ఈ యువతి కష్టానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

చిన్న వయస్సులోనే ఆరోగ్య సమస్యలు వస్తే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సాధ్యం కాదనే సంగతి తెలిసిందే.16 సంవత్సరాలకే వినికిడి శక్తిని కోల్పోయి కెరీర్ పరంగా సక్సెస్ సాధించిన సౌమ్యా శర్మ సక్సెస్ స్టోరీ గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యానికి గురి కాక తప్పదు.ప్రతి ఒక్కరూ కలలు కంటారు.ఆ కలలను నెరవేర్చుకునే వాళ్లు మాత్రం కొంతమందే ఉంటారు.ఐఏఎస్ అధికారి సౌమ్యా శర్మ సక్సెస్ స్టోరీ వింటే మాత్రం ఒకింత ఆశ్చర్యానికి గురి కాక తప్పదు.

 Ias Soumya Sharma Success Story Details Here Goes Viral In Social Media , Ias ,-TeluguStop.com

సౌమ్య( Soumya sharma ) 16 సంవత్సరాల వయస్సులోనే వినికిడి శక్తిని కోల్పోవడంతో సౌమ్య జీవితం గందరగోళంలో పడింది.

చెవులు వినబడకపోతే ఆ సమస్య ప్రమాదకరంగా ఉంటుంది.అయితే తన సమస్యనే ఆమె పాజిటివ్ గా మార్చుకోవడం గమనార్హం.వినికిడి పరికరాల సహాయంతో తన జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టిన ఈ యువతి ఆల్ ఇండియాలో తొమ్మిదో ర్యాంకును సొంతం చేసుకున్నారు.

Telugu Delhi, Soumya Sharma, Story, Upsc-Inspirational Storys

1994 సంవత్సరంలో జన్మించిన సౌమ్య ఢిల్లీ( Delhi )లో చదువుకున్నారు.2010 సంవత్సరంలో ఈ యువతి 10కు 10 జీపీఏ సాధించడం గమనార్హం.ఇంటర్ లో 94 శాతం మార్కులు సాధించిన సౌమ్య 2012 సంవత్సరంలో లా ఎంట్రెన్స్ పరీక్షను రాశారు.

లా పూర్తైన వెంటనే యూపీఎస్సీ( UPSC ) కోసం సౌమ్య ప్రిపరేషన్ ను మొదలుపెట్టారు.లా పరీక్షలు పూర్తైన తర్వాత నాలుగు నెలల్లోనే యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష రాశారు.

Telugu Delhi, Soumya Sharma, Story, Upsc-Inspirational Storys

ప్రతిరోజూ 16 నుంచి 17 గంటలు చదివిన సౌమ్య సొంతంగా నోట్స్ ను సిద్ధం చేసుకుని తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్ పాసయ్యారు.వినికిడి లోపం వల్ల రిజర్వేషన్ పొందే అవకాశం ఉన్నా సౌమ్య మాత్రం జనరల్ కోటాలోనే ఇంటర్వ్యూకు హాజరై ఐఏఎస్ అయ్యారు.సౌమ్యా శర్మ తమకు స్పూర్తిగా నిలిచిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సౌమ్యా శర్మ సక్సెస్ స్టోరీ గురించి తెలిస్తే ఆమెకు హ్యాట్సాఫ్ అనకుండా ఉండలేమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube