త్రివిక్రమ్‌ చేయి పడితే కోట్లు కురవాల్సిందే.. బ్రో' నే సాక్ష్యం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ( Trivikram Srinivas )ఒక వైపు వరుసగా సినిమా లు తెరకెక్కిస్తూ మరో వైపు కమర్షియల్‌ యాడ్స్ కి దర్శకత్వం వహిస్తున్నాడు.అంతే కాకుండా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న సినిమాలన్నింటికి కూడా స్క్రిప్ట్ వర్క్ లో తనదైన చేయి పెడుతున్నాడు.

 Pawan Kalyan Bro Movie Script Work By Trivikram Remuneration ,pawan Kalyan , B-TeluguStop.com

అంతే కాకుండా ఇటీవల పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో రూపొందిన బ్రో సినిమా యొక్క స్క్రిప్ట్‌ వర్క్ ను త్రివిక్రమ్‌ చూసుకున్నాడు.

Telugu Bheemla Nayak, Bro, Pawan Kalyan, Telugu, Tollywood, Trivikram-Movie

దర్శకత్వ పర్యవేక్షణ కూడా త్రివిక్రమ్‌ చేశాడు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కోసం బ్రో సినిమా వ్యవహారాల్లో త్రివిక్రమ్‌ చేయి పెట్టాడు.అయినా కూడా భారీ ఎత్తున పారితోషికం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

బ్రో సినిమా యొక్క స్క్రిప్ట్‌ వ్యవహారాలు చూసుకున్నందుకు గాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఏకంగా పది కోట్లు ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి.ఒక్క సినిమా స్క్రిప్ట్‌ వ్యవహారాలు చూసుకుంటే త్రివిక్రమ్‌ కు కోట్ల పారితోషికం ఇవ్వాల్సిందే.

ఏదైనా ఒక సినిమా యొక్క కథ చర్చలకు త్రివిక్రమ్‌ వెళ్తే రోజుకు అయిదు నుండి పదిహేను లక్షల వరకు కవర్స్ ఇస్తారట.ఇక మొత్తం తానే స్క్రిప్ట్‌ చూసుకుంటే కోట్లు కురవాల్సిందే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Telugu Bheemla Nayak, Bro, Pawan Kalyan, Telugu, Tollywood, Trivikram-Movie

భారీ అంచనాల నడుమ రూపొందిన బ్రో సినిమా కి అన్ని తానై త్రివిక్రమ్‌ చూసుకున్నాడు.పవన్ తో ఆయన తీసిన సినిమా నిరాశ పర్చినా కూడా ఆ మధ్య భీమ్లా నాయక్( Bheemla Nayak ) సినిమా కి కూడా త్రివిక్రమ్‌ స్క్రిప్ట్ వర్క్ చూసుకున్నాడు.అంతే కాకుండా ఇప్పుడు బ్రో సినిమా యొక్క వ్యవహారలు చూసుకుంటున్నాడు.కేవలం ఈ సినిమా ఆ సినిమా అన్నట్లుగా కాకుండా పవన్ కళ్యాణ్ చేస్తున్న దాదాపు అన్ని సినిమా ల యొక్క స్క్రిప్ట్‌ లో త్రివిక్రమ్‌ హ్యాండ్‌ ఎంతో కొంత ఉంటుంది.

అందుకు గాను భారీ పారితోషికం తీసుకోవడం జరుగుతూనే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube