ఆ రైటర్ కి ఛాన్స్ ఇస్తున్న సాయి ధరమ్ తేజ్...

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలను పోషించడానికి రెడీగా ఉంటారు.

ఇలాంటి క్రమంలోనే ఏ హీరో అయినా నెక్స్ట్ ఏ సినిమా చేయాలి ఆ సినిమా ఏ విధంగా ఉండాలనే దానిమీద ముందు నుంచే ప్రణాళికలు రెడీ చేసుకుంటారు.

అందులో భాగంగానే సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కూడా వరుసగా సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పటికే ఆయన సంపత్ నంది( Samapth Nandi ) డైరెక్షన్ లో గంజా శంకర్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత ఆయన రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.ప్రస్తుతం ప్రసన్న నాగార్జునతో ఒక సినిమా చేస్తూ డైరెక్టర్ గా మారుతున్నాడు.

ఇక ఆ సినిమా ఇప్పటికే సెట్స్ మీద ఉంది.ఇక ఈ సినిమా పూర్తి అవ్వక ముందే ప్రసన్న రెండో సినిమాని సాయి ధరమ్ తేజ్ తో తీయాలని అనుకొని ఆయన కి కథ కూడా చెప్పినట్టు గా తెలుస్తుంది.

Advertisement

బెజవాడ ప్రసన్నకుమార్( Bejawada Prasanna umar ) మంచి సక్సెస్ ఫుల్ రైటర్ గా పేరు తెచ్చుకున్నాడు కానీ డైరెక్టర్ గా ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది కాబట్టి ఈ సమయంలో సాయి ధరమ్ తేజ ఆయనకి సినిమా ఇచ్చి తప్పు చేస్తున్నాడా అంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.నిజానికి ప్రసన్నకుమార్ అంటే అన్ని రొటీన్ సినిమా స్టోరీ లు రాస్తూ ఉండే రైటర్ గా ఆయన కి ఒక పేరు ఉంది.సాయి ధరమ్ తేజ్ కి చెప్పిన కథ కూడా రొటీన్ గా ఉంటుందా లేక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుందా అనేది చూడాలి.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు