మండల ప్రధాన కార్యదర్శిగా ఇప్ప మహేష్....

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా ఇప్ప మహేష్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ నియమించగా గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్ జలపతి నియామకం పత్రాన్ని ఇప్ప మహేష్ కు అందజేశారు.

ఈ సందర్భంగా ఇప్ప మహేష్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గెలుపు కోసం సహాయ శక్తులకు కృషి చేస్తానని వారన్నారు.

నన్ను మండల ప్రధాన కార్యదర్శి గా ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు , ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తరి మనోహర్, డిసిసి కార్యదర్శి చెలుకుల తిరుపతి, మండల బీసీ సెల్ అధ్యక్షుడు గండినారాయణ నాయకులు అభిలాష్ ,అరవింద్, తర్రే లింగం, శ్రీను మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించండి

Latest Rajanna Sircilla News