TSRTC MD Sajjanar : రెండు నెలల్లో ఆర్టీసీకి రూ.507 కోట్ల నిధులు..: ఎండీ సజ్జనార్

హైదరాబాద్ లో( Hyderabad ) కొత్తగా వంద బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్( TSRTC MD Sajjanar ) తెలిపారు.

టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో నూతన బస్సులు ప్రారంభం అయ్యాయి.

ఇందులో ఎక్స్ ప్రెస్ బస్సులను మహాలక్ష్మీ పథకం( Mahalakshmi Scheme ) కోసం వినియోగిస్తామని పేర్కొన్నారు.మిగతా సూపర్ లగ్జరీ బస్సులను శ్రీశైలంకి నడుపుతామని సజ్జనార్ వెల్లడించారు.

అలాగే 675 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నామన్న సజ్జనార్ ప్రభుత్వం సహకరిస్తే మరో వెయ్యి బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు.రెండు నెలల్లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.507 కోట్ల నిధులు అందించిందని తెలిపారు.టీఎస్ఆర్టీసీకి( TSRTC ) నష్టాలు తగ్గుతున్నాయని స్పష్టం చేశారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు