ఆర్ఆర్ఆర్ హీరోలను ఢీకొడతానంటోన్న పుష్ప

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తుండుగా, ఈ సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.దీంతో ఆర్ఆర్ఆర్ కోసం అప్పుడే కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

కాగా దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ చేస్తుండటంతో మరో భారీ చిత్రం అదే సమయంలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు ఏర్పడ్డాయి.అయితే ఈ సినిమాను కూడా దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Advertisement

దీంతో దసరాకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనబోతున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి.సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ పూర్తిగా రివెంజ్ డ్రామా చిత్రంగా రానుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తుండగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.కాగా ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అటు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పీరియాడికల్ మూవీగా జక్కన్న తెరకెక్కిస్తుండగా, ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాల మధ్య సాగే వార్‌లో ఏ సినిమా విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?
Advertisement

తాజా వార్తలు