ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్ ను ఆర్ఆర్ఆర్ లో కావాలనే డిలీట్ చేశారా.. ఇన్నాళ్లకు బయటకు?

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ ఈ సినిమా ఇటీవలే విడుదలై ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి రికార్డులు సృష్టించింది.

ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోల నటనకు, అలాగే దర్శకుడు రాజమౌళి క్రియేటివిటీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఈ సినిమాలో ఇద్దరు హీరోల మధ్య సన్నివేశాలు అన్ని హైలెట్ గా నిలిచాయి.ఈ సినిమా విడుదలైన తర్వాత ఇందులో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ డామినేషన్ ఎక్కువగా ఉంది అన్న వార్తలు వినిపించాయి.

మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ కీ స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంది అని ఎన్టీఆర్ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.ఇదే విషయంపై జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ విషయంపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి.

Advertisement
Rrr Charector Artist Revelas Jr Ntr Elivation Scene Delets Final Cuts Jr Ntr, Ra

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక సూపర్ ఎలివేషన్ సీను డిలీటెడ్ సీన్స్ లో కలిపి వేశారని ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ లో పోషించిన నటుడు రివీల్ చేశాడు.

Rrr Charector Artist Revelas Jr Ntr Elivation Scene Delets Final Cuts Jr Ntr, Ra

ఇటీవల యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ సినిమాలో బ్రిటిష్ వాళ్లు, ఎన్టీఆర్- చరణ్ ల మధ్య కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ.ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక పవర్ ఫుల్ సన్నివేశాన్ని డిలీట్ చేశారని చెప్పాడు.

ఆ సన్నివేశం ఎన్టీఆర్ ను రామ్ చరణ్ కొట్టిన తర్వాత వస్తుంది అని తెలిపాడు.రామ్ చరణ్ ఎన్టీఆర్ ను కొట్టిన తర్వాత జైలులో పెట్టిన సంగతి తెలిసిందే.

ఆ జైలు లో కొంతమంది తెలుగు ఖైదీలు ఉంటారు ఆ సన్నివేశంలో నేను కూడా ఉన్నాను అని తెలిపాడు.అయితే సినిమాలో ఓ సన్నివేశం ఉంటే సినిమా మరొక రేంజ్ లో ఉండేది అని చెప్పుకొచ్చాడు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

సదరు నటుడి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.ఇది తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళి పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇద్దరు హీరోలను సమానంగా చూపిస్తాను అని చెప్పి ఎన్టీఆర్ నటించిన అదిరిపోయే సన్నివేశాన్ని ఎందుకు డిలీట్ చేశారు అంటూ ప్రశ్నిస్తున్నారు.ఇంకొందరు మాత్రం ఆ సన్నివేశాన్ని ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయినప్పుడు జోడీ ఇస్తారేమో అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు