వైరల్: పని ఎక్కువయ్యిందేమో పాపం... అలసిపోయి పడిపోయిన రోబోని ఒకసారి చూడండి!

రోబోట్స్ ( Robot )గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు.చదువుకున్న వారు, చదువు లేని వారు అనే తేడా లేకుండా అందరికీ ఇవి సుపరిచితమే.

ఎందుకంటే సినిమాల ప్రభావం.దశాబ్దాల కిందటే రోబోలు అంటే ఇలా వుంటాయని మన దర్శకులు చెప్పకనే చెప్పేసారు.

ప్రపంచ రోబోటిక్ శాస్త్రవేత్తలు వీటిపైన నిరంతరం పరిశోధనలు చేస్తూనే వుంటారు.అవును, కొన్ని రంగాల్లో మనిషికి ప్రత్యామ్నాయంగా వీటి వాడకాన్ని ఆల్రెడీ షురూ చేసారు కూడా.

ఐతే పని చేయడంలో మనుషులకంటే రోబోలు బెటర్ అని ఫీల్ అవుతున్న వారు ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి తిలకించండి.

Robot Gets Tired After Days Work Collapses Video Viral Details, Robots, Viral Ne
Advertisement
Robot Gets Tired After Days Work Collapses Video Viral Details, Robots, Viral Ne

అవును, మనుషులకు పని చేయడం చేత కాదని మర మనుషులను కనిపిడితే.అవి కూడా ‘అలసితిని.సొలసితిని’ అంటూ నేలకూలిపోతున్నాయి.అవునా! రోబోలు కూడా అలసిపోతాయా? అని ఆశ్చర్యపోకండి.ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు, మనుషుల స్థానంలో రోబోట్‌లు, ఎలక్ట్రానిక్ హ్యూమన్‌ల సేవలను ప్రవేశపెడుతూ వస్తున్నారు.

దినదినాభివృద్ధి చెందుతున్నట్లుగా.వాటి సేవలు కూడా విస్తృతం కావడం గమనార్హం.

ఈ ప్రోగ్రామబుల్ మెషీన్‌లను వినియోగించడానికి కారణం.అవి అధిక సామర్థ్యం కలిగి ఉండడమే.

Robot Gets Tired After Days Work Collapses Video Viral Details, Robots, Viral Ne

ఎటొచ్చి వాటికి మనిషికి జీతాలు ఇచ్చినట్టు జీతభత్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా.అదీకాక మనుషుల ఎక్కువ గంటలు వాటిని వాడుకోవచ్చు.కానీ, ఇక్కడ సీన్ చూస్తే అంతా రివర్స్ అయిందే అని అంటారు.

దారుణం.. మురికి కాలువ నీటితో కూరగాయలు కడుగుతున్న వ్యాపారి... వీడియో చూస్తే గుండెలు గుభేల్!
ప్రజలను కొట్టడానికి దూసుకెళ్లిన రోబొ.. వీడియో వైరల్

రోబో అలసిపోయి,( Robot Tired ) కుప్పకూలిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక్కడ వీడియోని చూస్తే, కన్వేయర్ బెల్ట్‌పై రోబోట్ ప్లాస్టిక్ కంటైనర్‌లను పెడుతున్నట్లు కనబడుతోంది.

Advertisement

ఈ రోబోట్ గంటల తరబడి పని చేసిందో ఏమో, ఈ క్రమంలోనే కాసేపటి తరువాత ఒక కంటైనర్‌ను ఎత్తుతుండగా.ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.కాగా రోబోలు కూడా అలసిపోతాయా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

తాజా వార్తలు