కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయల దోపిడీ..: కోదండరాం

కాళేశ్వరం ప్రాజెక్టుపై టీజేఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని టీజేఎస్ నేత కోదండరాం ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుప్పకూల్చారని మండిపడ్డారు.కాళేశ్వరంతో ఉపయోగం లేదని తెలిసినా మాజీ సీఎం కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించడం చాలా కష్టమని చెప్పారు.మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగాయన్న కోదండరాం కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ప్రాజెక్టు అంశంలో ప్రభుత్వంపై భారం తగ్గేందుకు రీ షెడ్యూల్ చేయాలని తెలిపారు.

Advertisement
పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..!!

తాజా వార్తలు