స్వర్గంలో ఉన్న శ్రీదేవిని కూడా అరెస్టు చేస్తారా... తెలంగాణ పోలీసులను ప్రశ్నించిన వర్మ!

టాలీవుడ్ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

ఈయనపై కూటమి నేతలు కేసులు పెట్టడంతో అప్పటి నుంచి వార్తలలో నిలుస్తున్నారు.

ఏ క్షణమైన ఈయన అరెస్ట్ కావచ్చనే వార్తలు వినిపించాయి.అయితే ఈయన మాత్రం ముందస్తు బెయిల్ కు పిటిషన్ దాఖలు చేసి బెయిల్ సంపాదించారు.

ఇకపోతే ఈయనపై కేసు ఉన్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా నిత్యం పోలీసులను ప్రశ్నిస్తూ ఈయన పోస్టులు చేస్తున్నారు.

ఇకపోతే అల్లు అర్జున్( Allu Arjun ) అరెస్ట్ కావడంతో ఈయన అరెస్టును రాంగోపాల్ వర్మ పూర్తిస్థాయిలో ఖండిస్తూ వచ్చారు.ఇక సినీ సెలబ్రిటీలు అందరూ కూడా అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు.కానీ వర్మ మాత్రం ఇప్పటికీ అల్లు అర్జున్ అరెస్టును వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Advertisement

అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.అల్లు అర్జున్ అరెస్టును సినీ ఇండస్ట్రీ మొత్తం తీవ్రంగా ఖండించాలని ఈయన ట్వీట్ చేశారు.

ఏ సినిమా సెలబ్రిటీలు అయినా రాజకీయ నాయకులు అయిన పాపులర్ కావడం వారి తప్పా అంటూ ప్రశ్నించారు.అలాగైతే క్షణం క్షణం సినిమా( Kshana Kshanam Movie ) షూటింగ్ సమయంలో శ్రీదేవిని( Sri Devi ) చూడటం కోసం వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు.ఇలా పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగి ముగ్గురు అభిమానులు మరణించారు.

మరి ఈ ఘటనలో భాగంగా తెలంగాణ పోలీసులు( TG Police ) ఇప్పుడు స్వర్గానికి వెళ్లి మరి శ్రీదేవిని అరెస్టు చేస్తారా అంటూ ఈయన చేసిన పోస్ట్ తీవ్రదుమారం రేపుతుంది.ఇలా ఈ పోస్టు ద్వారా మరోసారి ఆర్జీవీ వార్తలలో నిలిచారు.

వైరల్: అదిరిపోయిన షారుఖ్, ఐశ్వర్య రాయ్ పిల్లల స్టేజ్ షో!
Advertisement

తాజా వార్తలు